ఆ విషయంలో అజింకా రహానేని అడ్డుకున్న వరుణుడు... సెంచూరియన్‌లో వర్షం కురవడంతో...

First Published Dec 27, 2021, 9:11 PM IST

అజింకా రహానేకి ఈ మధ్య టైం అసలు బాగోలేదు. ఫామ్‌ కోల్పోయి పరగులు చేయలేక టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోయిన అజింకా రహానే, సెంచూరియన్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కి వచ్చాడు...

న్యూజిలాండ్‌ టూర్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్, సౌతాఫ్రికాలో జరిగిన అనధికారిక టెస్టుల్లో రాణించిన హనుమ విహారిని కాదని వరుసగా ఫెయిల్ అవుతున్న రహానేకి ఛాన్స్ ఇవ్వడంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి..

అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన స్టైల్‌లో బ్యాటింగ్ కొనసాగించిన అజింకా రహానే 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 పరుగులు చేసి... మొదటి రోజు ముగిసే సమయానికి క్రీజులో ఉన్నాడు...

రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను రద్దు చేశారు అంపైర్లు. అయితే నేటి మ్యాచ్ సజావుగా సాగి, అజింకా రహానే సెంచరీ మార్కు అందుకుని ఉంటే... విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పినట్టు అయ్యేది...

సరిగ్గా ఏడాది క్రితం ఆస్ట్రేలియా టూర్‌లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు అజింకా రహానే. ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత టీమిండియాలో నూతనోత్సాహాలు నింపడానికి కారణమైందీ ఇన్నింగ్స్...

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ డకౌట్ అయినా, పూజారా 17 పరుగులు, శుబ్‌మన్ గిల్ 45 పరుగులు చేసి అవుట్ కావడంతో 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...

ఈ దశలో ఓ ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన అజింకా రహానే 223 బంతుల్లో 12 ఫోర్లతో 112 పరుగులు చేసి... భారత జట్టు మంచి స్కోరు చేయడానికి కారణమయ్యాడు...

అజింకా రహానే కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటైన మెల్‌బోర్న్ టెస్టు సెంచరీ, ఆడిలైడ్ పరాజయం నుంచి భారత జట్టు కోలుకుని... సిరీస్ గెలవగలమనే ధీమాని నింపింది...

ఈ సెంచరీ తర్వాత ఏడాదిగా లాంటి ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు అజింకా రహానే. నేడు వరుణుడు అంతరాయం కలిగించకుండా సజావుగా ఆట సాగి ఉంటే... సరిగా ఏడాదికి అదే రోజు సెంచరీ చేసిన రికార్డు కూడా రహానేకి దక్కేదంటున్నారు అభిమానులు...

click me!