గాయం నుంచి ఇంకా కోలుకోని జోఫ్రా ఆర్చర్... న్యూజిలాండ్‌తో సిరీస్‌కి దూరం, టీమిండియాతో జరిగే...

First Published May 17, 2021, 9:01 AM IST

న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కి ముందు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్‌‌తో జరిగే టెస్టు సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. 

టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనే మోచేతి గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు జోఫ్రా ఆర్చర్. మూడో టెస్టు ముగిసిన తర్వాత సర్జరీ కోసం స్వదేశానికి చేరుకున్నాడు ఆర్చర్.
undefined
జోఫ్రా ఆర్చర్ గాయంతో స్వదేశానికి పయనం కావడంతో టీమిండియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అతను లేకుండానే బరిలో దిగింది ఇంగ్లాండ్ జట్టు.
undefined
ఆర్చర్ మోచేతికి సర్జరీ నిర్వహించిన వైద్యులు, అతని చేతిలో గాజు ముక్కలు ఉండడాన్ని గుర్తించి, వాటిని తీసివేశారు. సర్జరీ తర్వాత దాదాపు ఆరు వారాల విశ్రాంతి తీసుకున్న జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ 2021 మొత్తానికి దూరమయ్యాడు...
undefined
గాయం నుంచి కోలుకుని కౌంటీల్లో ఆడిన జోఫ్రా ఆర్చర్, కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 5 ఓవర్లు మాత్రమే బైలింగ్ చేయగలిగాడు. కుడిచేతి మోచేతి దగ్గర తీవ్రనొప్పి వస్తుండడంతో బౌలింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు ఆర్చర్.
undefined
దీంతో మరోసారి వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్తున్న జోఫ్రా ఆర్చర్, వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కి దూరం కానున్నాడు. అయితే ఆ తర్వాత రెండు నెలలకు జరిగే టీమిండియాతో టెస్టు సిరీస్‌కి మాత్రం ఆర్చర్ కోలుకుని, బరిలో దిగే అవకాశం ఉంది.
undefined
జూన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత ఆగస్టు 4 నుంచి టీమిండియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
undefined
click me!