భారత్ చాలా గొప్పదేశం, కానీ ఈ మీడియా పీక్కుతినే గద్దల్లా తయారైంది... ఆసీస్ మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ కామెంట్

First Published May 16, 2021, 5:10 PM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం క్రియేట్ చేస్తోంది. ఈ విపత్తు నుంచి భారత్ కోలుకోవడానికి ప్రపంచ దేశాల క్రికెటర్లు తమవంతు సాయం చేస్తున్నారు. ఆసీస్ క్రికెటర్లు ప్యాట్ కమ్మిన్స్, బ్రెట్‌లీతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా కరోనా బాధితుల కోసం ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే భారత్‌లో కరోనా విజృంభణ గురించి ప్రపంచ మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలపై ఫైర్ అయ్యాడు ఆసీస్ మాజీ బ్యాట్స్‌మెన్ మాథ్యూ హేడెన్...

దేశంలో ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపడినన్నీ లేకపోవడం, ఆక్సిజన్ కొరత తదితర సమస్యలతో దేశం అతలాకుతలం అవుతోంది. అయితే ఇప్పటికే 4 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందచేసిన భారత ప్రభుత్వం, 18 కోట్ల డోజ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రపంచ మీడియాలో వాస్తవాలతో పాటు వేలల్లో తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
undefined
‘ప్రస్తుతం ఇండియా సెకండ్ వేవ్‌తో యుద్ధం చేస్తోంది. ఇప్పటికే వారు ఈ పోరాటం మధ్యలో ఉన్నారు. అక్కడ ఇంతకుముందుకంటే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమే. అయితే వైరస్ కంటే వేగంగా కొన్ని తప్పుడు వార్తలు విస్తరిస్తున్నాయి. కష్టాల్లో ఉన్న దేశాన్ని ఈ వార్తలు ఇంకా బాధల్లోకి నెట్టేస్తున్నాయి...
undefined
140 కోట్ల మంది ఉన్న దేశంలో ఓ పథకాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలులోకి తేవడం ఏ ప్రభుత్వానికైనా ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. నేను గత దశాబ్దకాలంలో ఇండియాకి చాలాసార్లు వెళ్లాను. అక్కడ చాలా ప్రాంతాలు తిరిగాను.
undefined
ముఖ్యంగా తమిళనాడు నాకెంతో నచ్చింది. అది నాకు ‘అధ్యాత్మక ఇళ్లు’ లాంటిది. అక్కడ నాయకులన్నా, ప్రభుత్వాధికారులన్నా నాకెంతో గౌరవం. ఎందుకంటే విభిన్న మతాలతో నిండిన దేశాన్ని నడిపించడం అంత సులువైన పని కాదు...
undefined
నేనెప్పుడూ ఇండియాకి వెళ్లిన భారతీయులు ఎంతో ప్రేమగా, అభిమానంగా పలకరిస్తారు. ఆ ప్రేమను నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అలాంటి దేశాన్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే నా హృదయం ద్రవీంచికుపోతోంది... కానీ అంతకంటే బాధాకరం బ్యాడ్ మీడియా...
undefined
భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే అక్కడి ప్రజలను అర్థం చేసుకోవాలి, అక్కడి మట్టిని అర్థం చేసుకోవాలి, వారి సంస్కృతి అర్థం చేసుకోవాలి. ఇది మీడియాకి చాలా పెద్ద ఛాలెంజ్...
undefined
ఓ క్రికెటర్‌, ఆటను ప్రేమించేవాడిగా నేను ఐపీఎల్ కవర్ చేసేందుకు చాలాసార్లు ఇండియాకి వచ్చాను. ఆస్ట్రేలియా నుంచి చాలామంది ఐపీఎల్ ఆడుతున్నారు. కానీ ఇప్పుడు ఇండియా నుంచి రాకపోకలను బంద్ చేస్తూ డోర్లు మూసేస్తున్నారు.
undefined
భారత ప్రభుత్వాన్ని కించపరుస్తూ, అవమానిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇండియాకి ఎంతో రుణపడి ఉన్న నేను, ఈ కష్టకాలో వారికి వేల మైళ్ల దూరంలో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు మాథ్యూ హేడెన్...
undefined
మాథ్యూ హేడెన్ ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్టు చేసిన వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర... ‘ఇండియాపై హృదయాన్ని కదిలించే ఆర్టికల్ రాసినందుకు మాథ్యూహేడెన్‌కి ధన్యవాదాలు. తనకంటే తన హృదయం చాలా పెద్దది. మాపై ఇంత దయ, ప్రేమ, ఆదరణ చూపిస్తున్నందుకు థ్యాంక్యూ’ అంటూ కామెంట్ చేశాడు ఆనంద్ మహేంద్ర.
undefined
click me!