ఇంటికి చేరుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... మాల్దీవులకు న్యూజిలాండ్, ఆసీస్ క్రికెటర్లు...

First Published May 8, 2021, 1:07 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేకులు పడడంతో, లీగ్‌ కోసం ఇక్కడికి వచ్చిన విదేశీ క్రికెటర్లు ఇంటిదారి పడుతున్నారు. అయితే దేశంలో ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొందరు ప్లేయర్లు, ఇక్కడి నుంచి మాల్దీవులకు చేరుకుంటున్నారు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2021లో పాల్గొన్న ఇంగ్లాండ్ ప్లేయర్లు సామ్ కుర్రాన్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్, మొయిన్ ఆలీ, జాసన్ రాయ్, టామ్ కుర్రాన్... క్షేమంగా ఇంటికి చేరుకున్నారు...
undefined
అలాగే ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, నెం.1 టీ20 బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్, ఆల్‌రౌండర్ క్రిస్‌ జోర్డాన్... ఇప్పటికే స్వదేశానికి బయలదేరారు... వీళ్లు ఆదివారం ఇంటికి చేరుకునే అవకాశాలున్నాయి.
undefined
అయితే భారత్‌లో ఉన్న సెకండ్ వేవ్ కరోనా కేసుల కారణంగా ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ కూడా విమానరాకపోకలపై నిషేధం విధించింది. మే 15వరకూ ఈ బ్యాన్ కొనసాగనుంది...
undefined
దీంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనడానికి వచ్చిన 14 మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు (ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై వెళ్లిపోగా మిగిలినవాళ్లు) ఇక్కడి నుంచి మాల్దీవులకు చేరుకుని, అక్కడ సేదతీరుతున్నారు.
undefined
వీరితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ సిమాన్ కటిచ్, కామెంటేటర్లుగా వ్యవహారిస్తున్న బ్రెట్ లీ కూడా ఈ బృందంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు.
undefined
చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ మైఖేల్ హుస్సీ మాత్రం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయనకి స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండడం, సహచర బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్ రావడంతో హుస్సీని ఐసోలేషన్‌ను ఉంచారు అధికారులు...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం ఇక్కడికి వచ్చిన న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియంసన్, కేల్ జెమ్మీసన్, మిచెల్ సాంట్నర్... కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లతో కలిసి మాల్దీవులకు వెళ్లిపోయారు.
undefined
వాస్తవానికి మే 10 వరకూ ఢిల్లీలోనే ఉండి, మే 11న నేరుగా ఇంగ్లాండ్ వెళ్లి... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రాక్టీస్ చేయాలని భావించారు న్యూజిలాండ్ ప్లేయర్లు.
undefined
అయితే కరోనా కేసులు, వార్తలతో భయాందోళనలకు గురైన కేన్ విలియంసన్ అండ్ కో... ఇక్కడ ఉండడం కంటే మాల్దీవులకు చెక్కేయడమే బెటర్ అని భావించారట...
undefined
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మాత్రం జట్టు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఛార్టెడ్ ఫ్లైట్‌లో స్వదేశం చేరుకున్నాడు. వేరే ఫ్రాంఛైజీల ప్లేయర్లను కూడా తీసుకెళ్తామని ముంబై ఇండియన్స్ ఆఫర్ ఇచ్చినా, ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
undefined
click me!