FIFA: ప్రపంచకప్ తర్వాత మెస్సీ రిటైర్ అవుతాడా..? క్లారిటీ ఇచ్చిన అర్జెంటీనా హెడ్ కోచ్

First Published Dec 13, 2022, 4:16 PM IST

FIFA World Cup 2022: ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజంగా గుర్తింపు పొందిన అర్జెంటీనా  సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ లో  తన జట్టును సెమీఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో  అర్జెంటీనా  సెమీస్ కు చేరింది. అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ అన్నీ తానై  జట్టును సెమీస్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  గత  ప్రపంచకప్ రన్నరప్ గా నిలిచిన క్రొయేషియాతో పోరులో భాగంగా  అర్జెంటీనా  అన్ని అస్త్రాలను సిద్ధం  చేసింది. 

ఈ మ్యాచ్ కు ముందు  ఫుట్‌బాల్ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత అర్జెంటీనా  సారథి  మెస్సీ రిటైర్ కాబోతున్నాడని.. నేటి సెమీస్ గెలిస్తే ఇక ఈ స్టార్  ప్లేయర్ కెరీర్ లో మరో రెండు మ్యాచ్ లు మాత్రమే (జాతీయ జట్టు తరఫున) మిగిలున్నాయని  పుకార్లు షికారు చేస్తున్నాయి. 

మెస్సీ వయసు దృష్ట్యా కూడా ఈ వార్తలు వస్తుండటం గమానార్హం. ప్రస్తుతం మెస్సీ వయసు 35 ఏండ్లు.  2026లో జరిగే ఫిఫా ప్రపంచకప్ కు  మెస్సీ ఆడటం  అతిశయోక్తే అవుతుంది.   దీంతో ఖతర్ లో జరిగే టోర్నీయే మెస్సీ కి చివరి వరల్డ్ కప్ అని..  క్రొయేషియాతో మ్యాచ్ గనక ఓడితే అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించాలనే  మెస్సీ కల చెదిరినట్టేనని  వాదనలు  మొదలయ్యాయి. 

అయితే ఈ కామెంట్స్ పై అర్జెంటీనా హెడ్ కోచ్ లియోనల్ స్కలోని   స్పందించాడు. ప్రస్తుతం మెస్సీ ఆటగాడిగా, కెప్టెన్ గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని, రిటైర్మెంట్  నిర్ణయం అతడికే వదిలేశామని అన్నాడు. క్రొయేషియా తో మ్యాచ్ కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో  స్కలోని ఈ వ్యాఖ్యలు చేశాడు. 

Image Credit: Getty Images

స్కలోని మాట్లాడుతూ.. ‘ఫిఫా వరల్డ్ కప్ తర్వాత మెస్సీ అర్జెంటీనాకు ఆడతాడా..? లేదా..? అన్నది  వేచి చూడాల్సిన విషయం.  ప్రస్తుతం మెస్సీ తన ఆటను ఆస్వాదిస్తున్నాడు. అతడితో పాటు మేం కూడా మెస్సీ ఆటను ఎంజాయ్ చేస్తున్నాం.  ఇంత సంతోష సమయంలో  మెస్సీ రిటైర్మెంట్ చర్చ అనవసరమని నా భావన. 

Image Credit: Getty Images

మెస్సీ అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్ గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. మనం కూడా మెస్సీ ఆటను ఎంజాయ్ చేద్దాం.  అర్జెంటీనా విజయం సాధించాలని మెస్సీ కలలు కంటున్నాడు. ఆ కల నిజమవ్వాలని కోరుకుందాం.. నాకు తెలిసి  ఫిఫా ప్రపంచకప్ ముగిసిన తర్వాత  కూడా మెస్సీ  కొనసాగుతాడు.. మెస్సీకి కుటుంబ ప్రోత్సాహం బాగుంది. అతడు రిటైర్మెంట్ గురించి ఆలోచించడని  నా అభిప్రాయం..’ అని తెలిపాడు. 

click me!