మేం వరల్డ్‌కప్ గెలవడానికి ఐపీఎల్ సాయపడింది... ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...

First Published Mar 12, 2021, 4:30 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన రెండు రోజులకే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభిస్తుండడం, ఇంగ్లాండ్ జట్టులో చీలకలు తెచ్చేలా కనిపిస్తోంది. ఐపీఎల్‌ను మధ్యలో వదిలి రాలేమంటూ జోస్ బట్లర్ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.

తాజాగా ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఐపీఎల్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు... ఐపీఎల్ వల్ల ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును ఎంతో మేలు జరిగిందని కితాబిచ్చాడు...
undefined
‘ఐపీఎల్ ఓ అద్భుతమైన టోర్నీ. దీన్ని కేవలం డబ్బులతో ముడిపెట్టి చూడడం సరికాదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు, అంతర్జాతీయ క్రికెట్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ఐపీఎల్ సాయపడింది...
undefined
2019 వన్డే వరల్డ్‌కప గెలవడానికి ఐపీఎల్ కూడా ఓ కారణం. టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్‌కి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇలాగే సాయపడుతుందని ఆశిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు ఇయాన్ మోర్గాన్...
undefined
2021 చివర్లో టీమిండియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కాబోతుండగా, 2023లో వన్డే వరల్డ్‌కప్ కూడా భారత్‌లో జరగనుంది. ఈ రెండు మెగా టోర్నీల్లో రాణించడానికి ఐపీఎల్ ఉపయోగపడుతుందని ఆకాంక్షించాడు మోర్గాన్...
undefined
‘ఐపీఎల్ ఆడడం వల్ల ప్రపంచంలో మేటి క్రికెటర్లతో కలిసి ఆడే అద్భుతమైన అవకాశం దొరుకుతోంది. అంతేకాకుండా ఇక్కడి పిచ్ పరిస్థితులపై కూడా మాకో అవగాహన ఏర్పడుతుంది..
undefined
ఐపీఎల్ కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు పొందిన ఆత్మవిశ్వాసం, అనుభవాన్ని డబ్బుతో వెలకట్టలేం... ఐపీఎల్‌ ఓ తిరుగులేని క్రికెట్ టోర్నీ... ఈ అనుభవం అందరికీ దక్కాల్సిందే...
undefined
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఐపీఎల్ వల్ల ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్ల నుంచి నేర్చుకోవచ్చు... వరల్డ్‌లో ది బెస్ట్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, వారితో స్నేహం పెంచుకోవచడం... ఇవన్నీ వెలకట్టలేనివి’ అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ మోర్గాన్.
undefined
గత సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన ఇయాన్ మోర్గాన్, సీజన్ మధ్యలో దినేశ్ కార్తీక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 66 మ్యాచులు ఆడిన మోర్గాన్, 1272 పరుగులు చేశాడు...
undefined
click me!