T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్

Published : Jul 03, 2026, 09:07 AM IST

T20 World Cup 2026 Final: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ప్రవేశించింది. సౌతాఫ్రికాపై 40 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

PREV
16
సౌతాఫ్రికాకు ఇంగ్లాండ్ షాక్.. ఆదివారం ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్

లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరగబోయే గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తలపడనుంది. మరోవైపు, వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరాలన్న సౌతాఫ్రికా కలలు కల్లలయ్యాయి.

26
టాస్ గెలిచి బ్యాటింగ్.. మొదట్లో ఇంగ్లాండ్‌కు షాక్

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు సౌతాఫ్రికా బౌలర్లు షాకిచ్చారు. షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్ ఊపుమీద ఉండటంతో కేవలం 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. గత సెమీఫైనల్స్ చేదు జ్ఞాపకాలు ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్‌ను వెంటాడాయి. కానీ, ఆ సమయంలో కెప్టెన్ నటాలీ సీవర్ బ్రంట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

36
నటాలీ సీవర్ బ్రంట్ ఊరమాస్ ఇన్నింగ్స్

క్యాఫ్ ఇంజ్యూరీ తో బాధపడుతూ, ఈ మ్యాచ్‌కు ఫిట్ అవుతుందో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ నటాలీ గ్రౌండ్‌లోకి వచ్చింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ కేవలం 47 బంతుల్లోనే 75 పరుగులు పిండుకుంది. హీథర్ నైట్‌తో కలిసి అదిరిపోయే పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పింది. పిచ్ కాస్త డ్రైగా ఉండి, బౌన్స్ సరిగ్గా లేకపోయినా ఇంగ్లాండ్‌ను 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చింది.

46
చేతులెత్తేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు

170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. రన్ రేట్ ఒత్తిడి పెరిగిపోవడంతో ప్రోటీస్ బ్యాటర్లు ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరారు. టజ్మిన్ బ్రిట్స్ (51 రన్స్) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. లారా వోల్వార్డ్ (17 రన్స్) వికెట్ పడటంతో సౌతాఫ్రికా పతనం ఆగలేదు. ఇంగ్లాండ్ బౌలర్ ఫ్రేయా కెంప్ తన వేరియేషన్లతో బ్యాటర్లను తెగ కన్ఫ్యూజ్ చేసింది. ఆఖరికి సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.

56
సోఫీ ఎక్లెస్టోన్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫీల్డింగ్ నెక్ట్స్ లెవెల్‌లో సాగింది. ముఖ్యంగా సోఫీ ఎక్లెస్టోన్ మిడ్-ఆన్‌ వద్ద వెనక్కి పరుగెడుతూ, గాల్లోకి లేచి పట్టిన లారా వోల్వార్డ్ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. టోర్నీలో ఎక్కువ క్యాచ్‌లు వదిలేశారన్న విమర్శలకు ఈ ఒక్క క్యాచ్‌తో ఇంగ్లాండ్ గట్టి సమాధానం చెప్పింది. సోఫీ ఎక్లెస్టోన్ టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా (38 వికెట్లు) రికార్డు సృష్టించింది.

66
లార్డ్స్‌లో హోమ్ ఫైనల్.. కప్ ఇంగ్లాండ్ దేనా?

సొంత గడ్డపై ఆడుతున్న ఇంగ్లాండ్‌కు ఓవల్ లో అభిమానుల నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నటాలీ సీవర్ బ్రంట్ మాట్లాడుతూ, ‘‘సొంత ప్రేక్షకుల ముందు ఆడటం చాలా స్పెషల్. లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అని ఆశిస్తున్నా’’ అంటూ జోష్ నింపింది. ఇప్పటివరకు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరగా, ఇంగ్లాండ్ 5వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. మరి ఈ సారి టైటిల్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories