‘అందరూ మొతేరా పిచ్‌నే విమర్శిస్తున్నారు. కానీ పిచ్ ఎలా ఉందనేది పక్కన పెడితే, మనవాళ్ల బ్యాటింగ్ సరిగా లేదు. అవును... పిచ్ కనిపించినంత సాఫ్ట్‌గా అయితే ఏం లేదు. కానీ ఈ పిచ్‌పై వికెట్ కాపాడుకుంటే ఈజీగా బ్యాటింగ్ చేయొచ్చు...
కనీసం ఒక సెషన్‌లో అయినా వికెట్ పడకుండా నిలుపుకుని పరిస్థితి వేరేగా ఉండేది. కానీ భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ పిచ్‌పైన టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడం ప్రధానమైన తప్పిదం.
కానీ మంచి స్కోరు సాధిస్తే టీమిండియాపై ఒత్తిడి పెంచొచ్చని భావించాం... అయితే టీమిండియా బౌలింగ్ వల్ల సీన్ మారిపోయింది. మూడు సెషన్లలోపే ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయిపోయింది...
బౌలింగ్‌లో బాగానే రాణించామని చెప్పాలి. కానీ టీమిండియాను ఆధిక్యం సాధించకుండా నిలువరించి ఉంటే, మ్యాచ్‌పైన పూర్తి పట్టు సాధించి ఉండేవాళ్లం... రెండో ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోవడం కూడా మాపై ఒత్తిడి పెరగడానికి కారణమైంది...
మొదట్లోనే రెండు వికెట్లు పడిపోతే, ఏ జట్టు అయినా ఒత్తిడిలోకి వెళుతుంది. వికెట్ కాపాడుకోవడానికి బ్యాట్స్‌మెన్ ప్రయత్నిస్తాడు. ఇది ప్రత్యర్థి జట్టుకు బలాన్ని ఇస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులు చేసి ఉంటే కచ్ఛితంగా గెలిచేవాళ్లమని అనిపిస్తుంది...
ఓటమికి కారణాలను వెతుక్కోవడం కరెక్టు కాదు... రెండు జట్లూ ఒకే పిచ్‌పైన ఆడాయి. కానీ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ కంటే మెరుగ్గా ఆడింది....’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ జొనాథన్ ట్రాట్.
బ్యాట్స్‌మెన్ ఆధిక్యానికి అలవాటు పడినవారికి, బౌలర్ల డామినేషన్ చూడడం కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పిన ట్రాట్... పింక్ బాల్ టెస్టులో స్పిన్నర్లు రాణించడం వల్లే ఇంత చర్చ జరుగుతోందని చెప్పాడు..
అయితే టెస్టు క్రికెట్ స్పెషాలిటీ ఇదేనని చెప్పిన ట్రాట్... ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దేశాల్లో డిఫరెంట్ కండీషన్లలో రాణించినప్పుడే గొప్ప క్రికెటర్‌గా గుర్తించబడతామని చెప్పాడు...