హైదరాబాద్‌కి షాక్... ఐపీఎల్ 2021 షార్ట్ లిస్ట్ వేదికల నుంచి అవుట్... కరోనా ఉన్నా ముంబైలో...

First Published Feb 28, 2021, 4:08 PM IST

ముంబై మహానగరంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్ 2021 వేదికగా హైదరాబాద్ ఖరారు అవుతుందని ఆశించిన తెలుగు అభిమానులకు నిరాశే ఎదురైంది. కరోనా కేసులున్న ముంబైలో జనాలు లేకుండా మ్యాచులు నిర్వహించేందుకు మొగ్గు చూపిన ఐపీఎల్ యాజమాన్యం, హెచ్‌సీఏ నిర్ణయంతో  2021 సీజన్‌ కోసం షార్ట్ లిస్టు చేసిన వేదికల నుంచి హైదరాబాద్‌ను తొలగించింది...

తొలుత కేవలం ముంబై, పూణే నగరాల్లో ఐపీఎల్ 2021 మ్యాచులన్నీ నిర్వహించాలని భావించింది. ఈ రెండు నగరాల్లోని నాలుగు స్టేడియాల్లో ఐపీఎల్ 14వ సీజన్ నిర్వహించి, ప్లేఆఫ్ మ్యాచులను అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో పెట్టాలని భావించారు...
undefined
అయితే మహారాష్ట్రలో మరోసారి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఆలోచన మార్చుకుంది ఐపీఎల్ యాజమాన్యం. రెండు నగరాల్లో జనాలు లేకుండా నిర్వహించడం కంటే, ఆరు నగరాల్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించడం తేలికగా ఉంటుందని భావిస్తోంది....
undefined
ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ కోసం ఆరు నగరాలను షార్ట్ లిస్టు చేసింది బీసీసీఐ. అయితే ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండడంతో హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచులు ఉంటాయని భావించారంతా. భాగ్యనగరం కూడా ఐపీఎల్ వేదికగా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి.
undefined
అయితే ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ముంబై, పూణే నగరాల్లో మ్యాచులు నిర్వహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఐపీఎల్ 2021 వేదికల లిస్టులో నుంచి హైదరాబాద్ తప్పుకుంది...
undefined
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపిన తర్వాతే షార్ట్ లిస్టులో నుంచి హైదరాబాద్‌ను తొలగించినట్టు సమాచారం. కరోనా నిబంధనలకు అనుకూలంగా మ్యాచులు నిర్వహించడం సాధ్యం కాదని హెచ్‌సీఏ చేతులేత్తేయడంతో ఐపీఎల్ లిస్టులో నుంచి హైదరాబాద్‌ను తొలగించింది బీసీసీఐ...
undefined
ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తా, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ముంబైలో మ్యాచులకు ప్రేక్షకులకు అనుమతి ఉండదు. మిగిలిన నగరాల్లో జరిగే మ్యాచులకు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తారు..
undefined
ఐపీఎల్‌ 2021 సీజన్‌‌ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 5న లేదా 6న జరుగుతుందని అంచనా. సీజన్ ముందుకు వస్తుండడంతో ప్రారంభ తేదీకి నెల రోజుల ముందే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరుతున్నాయి ఫ్రాంఛైజీలు...
undefined
click me!