టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడి తప్పు చేశా... ఫీల్ అవుతున్న డేవిడ్ వార్నర్...

First Published Mar 4, 2021, 1:53 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది భారత జట్టు. వన్డే సిరీస్‌ను 2-1 సిరీస్‌తో కోల్పోయినా, టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు. ఆ తర్వాత ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుని, చారిత్రక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ సిరీస్‌లో పాల్గొని, తప్పు చేశానని బాధపడుతున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్...

మొదటి రెండు వన్డేల్లో అద్భుత హాఫ్ సెంచరీలు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన డేవిడ్ వార్నర్, మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...
undefined
మొదటి రెండు టెస్టుల్లో కూడా పాల్గొనని డేవిడ్ వార్నర్‌ను మూడో టెస్టులో బరిలో దింపింది ఆస్ట్రేలియా. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో ఊహించని పరాజయంతో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా యంగ్ బ్యాట్స్‌మెన్ పుకోవిస్కీ, డేవిడ్ వార్నర్‌లను మూడో టెస్టు బరిలో దింపింది ఆస్ట్రేలియా...
undefined
టీమిండియాపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న డేవిడ్ వార్నర్, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు మాత్రమే చేశాడు. అయినా గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో కూడా వార్నర్‌ను ఆడించింది ఆసీస్.
undefined
గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే పెవిలియన్ చేరిన వార్నర్, రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసి రాణించాడు.‘నిజానికి టెస్టు సిరీస్ సమయానికి నేను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు...
undefined
కేవలం ఆస్ట్రేలియా జట్టుకు నా అవసరం ఉందనే ఉద్దేశంతోనే టెస్టు సిరీస్ ఆడాలని నిర్ణయించుకున్నా... ఇప్పుడు టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడి తప్పుచేశాననిపిస్తోంది...
undefined
గాయం పూర్తిగా మానకముందే ఆడడంతో తీవ్రత మరింత పెరిగింది. గాయం పూర్తిగా మానేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు డాక్టర్లు... అప్పుడు జట్టు గురించి కాకుండా, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుండేది. అలా చేసి ఉంటే, టెస్టు సిరీస్ ఆడేవాడిని కాదు...
undefined
టీమ్ అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా, నా జట్టుకు సాయం చేయాలని ఆడతానని చెప్పాను. ఉదరం, గజ్జల్లో నొప్పిని భరిస్తూనే బరిలో దిగాను. ఇప్పుడు నొప్పి మరింతగా పెరిగింది... ఇలాంటి గాయాన్ని ఇంతకుముందు నేను ఫేస్ చేయలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్...
undefined
సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే డేవిడ్ వార్నర్, గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఏడు నుంచి ఎనిమిది నెలల దాకా సమయం పడుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే...
undefined
లాంగ్ గ్యాప్ తీసుకుంటానని వార్నర్ ప్రకటించడంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్ పాల్గొనడేమోనని అనుమానాలు కలిగాయి. అయితే ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ తరుపున ఆడతానని స్పష్టం చేశాడు డేవిడ్ వార్నర్...
undefined
click me!