కపిల్ దేవ్, ధోనీ... ఇప్పుడు రోహిత్ శర్మ! బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published | Nov 5, 2022, 12:42 PM IST

టీమిండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. భారత జట్టుకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్... ఈ ముగ్గురి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ...

కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది భారత జట్టు. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన టీమిండియా, ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ క్లాస్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లతో నిండిన వెస్టిండీస్‌ని చిత్తు చేసి... ఛాంపియన్‌గా నిలిచింది...

కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ. 1983 తర్వాత 28 ఏళ్లకు 2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ గెలిచింది భారత జట్టు. అంతకుముందు 2007లో టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది..


Rohit Sharma

2007 వరల్డ్ కప్ నుంచి 2022 వరకూ టీమిండియా ఆడిన ప్రతీ పొట్టి ప్రపంచకప్‌లోనూ సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ, ఈసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పెద్దగా అంచనాలు లేకుండా 2022 టోర్నీని మొదలెట్టిన టీమిండియా... సెమీస్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ చేసుకుంది...

Image credit: PTI

‘రోహిత్ శర్మకు చాలా అనుభవం ఉంది. అతను ఎన్నో మ్యాచులు ఆడాడు, ఫామ్‌లో రావడం ఎలాగో బాగా తెలిసి ఉంటుంది. కెప్టెన్ ఆడితే మిగిలిన ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ధోనీతో కపిల్ దేవ్‌ని కానీ సునీల్ గవాస్కర్‌ని కానీ పోల్చి చూడడం తప్పు...

ఎందుకంటే కపిల్ దేవ్ కెప్టెన్సీ చేసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. రోహిత్ శర్మ కూడా అంతే... టీమ్‌ని నడిపించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.

Image credit: PTI

వరల్డ్ కప్ గెలవడానికి కావల్సినవన్నీ టీమిండియాలో ఉన్నాయి. రోహిత్ శర్మ వాటిని సరిగ్గా వాడుకుంటాడనే అనుకుంటున్నా. టీ20ల్లో పవర్ ప్లే చాలా ముఖ్యం. ఓపెనర్లు మంచి ఆరంభం అందిస్తే, ఆ తర్వాతి బ్యాటర్లు మిగిలిన పని పూర్తి చేస్తారు. 

ఇప్పుడు టీమ్స్ అన్నీ ఛేదన చేయడానికి ఇష్టపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేయడమంటే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారు... ఎందుకంటే ఇప్పుడు వికెట్లు కూడా అలా మారాయి.

Image credit: PTI

గేమ్ నడిచే కొద్దే పిచ్ స్లో అయ్యి, బ్యాటింగ్‌కి బాగా అనుకూలంగా మారుతోంది. అందుకే రెండోసారి బ్యాటింగ్ చేసే టీమ్‌కి అనుకూలంగా ఉంటోంది... ’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. 

Latest Videos

click me!