Virat Kohli
విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, మాకు రావాల్సిన ఐదు పెనాల్టీ పరుగులు రాలేదని బంగ్లా క్రికెటర్ నురుల్ హసన్ చేసిన కామెంట్లు, పెద్ద దుమారమే రేపాయి. అదీకాకుండా విరాట్ కోహ్లీ నో బాల్‌కి అప్పీలు చేసిన వెంటనే అంపైర్లు, నో బాల్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అయ్యింది...
బీసీసీఐ, ఐసీసీను ప్రభావితం చేయడం వల్లే టీమిండియాకి అనుకూలంగా నిర్ణయాలు వస్తున్నాయని పాక్ క్రికెట్ బోర్డు, మాజీ పాక్ క్రికెటర్లు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ...
virat kohli
‘ఐసీసీ మాకు చుట్టేమేమీ కాదు, మేం చెప్పినట్టల్లా వినడానికి.. ఐసీసీ దృష్టిలో అందరూ సమానమే. టీమిండియాకి అనుకూలంగా నిర్ణయాలు ఇస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. మేం మిగిలిన టీమ్స్‌తో పోలిస్తే ప్రత్యేకంగా ఏం పొందుతున్నాం?
Image credit: PTI
క్రికెట్‌లో ఇండియా చాలా పెద్ద పవర్ హౌస్. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మేం మా పలుకుబడినీ, ధనాన్ని ఐసీసీ టోర్నీల్లో వాడడం లేదు. వాడితే రిజల్ట్ వేరేలా ఉంటుంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు రోజర్ బిన్నీ...
India vs Pakistan
‘ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడడం మా చేతుల్లో లేదు. మేం ప్రభుత్వం ఏం చెబితే దాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాకపోతే పాక్‌లో పర్యటించలేం, అలాగే వేరే టీమ్స్ ఇక్కడికి రాలేవు...
India vs Pakistan
బీసీసీఐ స్వంతంగా ఏ నిర్ణయాలు తీసుకోదు. ప్రభుత్వంపై ఆధారపడి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే పాక్‌లోనే ఆసియా కప్ నిర్వహించాలని అనుకుంటే, భారత జట్టు రాకున్నా పెట్టుకోవచ్చు, మాకెలాంటి అభ్యంతరం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు రోజర్ బిన్నీ..