సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు సిక్సర్ల మోత మోగించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రియాంష్ (120), ఆయుష్ బదోని (165) ధాటికి సౌత్ ఢిల్లీ జట్టు 308 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ నార్త్ ఢిల్లీ జట్టుకు 309 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంత పెద్ద స్కోర్ చేయడంలో ఆయుష్ బదోని, ప్రియాంష్ ఆర్య హీరోయిక్ పాత్ర పోషించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు బౌలర్లను ధీటుగా ఎదుర్కొని ఫోర్లు, సిక్సర్లు బాదారు.