భార‌త ఒలింపిక్ ఛాంపియ‌న్ నీరజ్ చోప్రా పెళ్లి.. ఫోటోలు వైరల్

Published : Jan 19, 2025, 10:23 PM IST

Neeraj Chopra Gets Married: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ మెడ‌లిస్ట్ నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. హిమానీతో తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  

PREV
15
భార‌త ఒలింపిక్ ఛాంపియ‌న్ నీరజ్ చోప్రా పెళ్లి.. ఫోటోలు వైరల్
Neeraj Chopra

Neeraj Chopra Gets Married: భార‌త స్టార్ ఆట‌గాడు, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

25
Neeraj Chopra

"నా కుటుంబంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. మమ్మల్ని ఈ క్షణానికి తీసుకువచ్చిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతలు. ప్రేమతో బంధించబడ్డాను.. ఎప్పటికీ ఆనందంగా ఉంటాను" అని నీరజ్ పోస్ట్‌కు క్యాప్షన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోల‌ను పంచుకున్నారు.

35

అథ్లెట్ నీర‌జ్ చోప్రా మేనమామ తెలిపిన వివరాల ప్రకారం నీరజ్ భార్య హిమానీ ప్రస్తుతం USAలో చదువుతోంది. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

45

పెళ్లికి రిసెప్షన్ పార్టీ కూడా ఉంటుందని నీరజ్ మామ తెలిపారు. వృత్తిపరంగా, నీరజ్ కాంటినెంటల్ టూర్ జావెలిన్-ఓన్లీ పోటీని దేశానికి తీసుకురానున్నారు. రాబోయే ఈవెంట్‌ను వరల్డ్ అథ్లెటిక్స్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించాయి. 

వేదిక ఇంకా ఖరారు కానప్పటికీ, ఈ ఈవెంట్ ఈ సంవత్సరం మేలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లలో కొంతమందిని ఇక్క‌డ చూడ‌వ‌చ్చు.  చోప్రా నేతృత్వంలో జ‌రిగే పోటీలో మొదటిసారిగా భారత గడ్డపై పోటీపడతారు.

 

55

నీరజ్ ప్రస్తుతం కొత్త సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. బ్రస్సెల్స్ లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ 2024లో అండర్సన్ పీటర్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచి 2024 సీజన్ ను ముగించాడు. 

2024 పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ భారత్‌కు ఏకైక రజత పతకాన్ని అందించాడు. రజతం సాధించడంతో ఒకటి కంటే ఎక్కువ ఒలింపిక్ పతకాలు సాధించిన భారత అథ్లెట్ల జాబితాలో నీరజ్ చేరాడు. గత ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు.
 

Read more Photos on
click me!

Recommended Stories