తొందరపడితే షాహీన్ ఆఫ్రిదీ గతే పడుతుంది! జస్ప్రిత్ బుమ్రా గాయంపై రవిశాస్త్రి కామెంట్..

Published : Jun 25, 2023, 04:54 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా గాయపడ్డాడు. పూర్తి ఫిట్‌గా లేకపోయినా అతన్ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడించింది పాకిస్తాన్...

PREV
15
తొందరపడితే షాహీన్ ఆఫ్రిదీ గతే పడుతుంది! జస్ప్రిత్ బుమ్రా గాయంపై రవిశాస్త్రి కామెంట్..

టీమిండియాతో జరిగిన కమ్‌బ్యాక్ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన షాహీన్ ఆఫ్రిదీ, కొన్ని రోజులకే గాయం తిరగబెట్టడంతో మళ్లీ టీమ్‌కి దూరమయ్యాడు. అప్పటి నుంచి వరుసగా గాయాలతో బాధపడుతూ టీమ్‌కి దూరంగా ఉంటున్నాడు..

25
Jasprit Bumrah

ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా రెండు మ్యాచులు మాత్రమే ఆడి గాయం తిరగబెట్టడంతో మళ్లీ టీమ్‌కి దూరమయ్యాడు. 9 నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్న బుమ్రా, ఐర్లాండ్ టూర్‌లో రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది..

35

‘జస్ప్రిత్ బుమ్రా, టీమిండియాకి చాలా ముఖ్యమైన ప్లేయర్. అయితే వరల్డ్ కప్‌ కోసం అతన్ని తొందరపడి ఆడిస్తే.. మొదటికే మోసం వస్తది. గాయం తిరగబెడితే మరో నాలుగు నెలల పాటు టీమ్‌కి దూరం అవుతాడు..

45
Bumrah-Afridi

షాహీన్ ఆఫ్రిదీ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి, టీమిండియా తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉండడానికి చాలా సున్నితమైన వ్యత్యాసం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి..

55

జస్ప్రిత్ బుమ్రా లేకపోయినా టీమ్‌ని నడిపించేందుకు మనదగ్గర బౌలర్లు ఉన్నారు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ.. టీమ్‌లో సీనియర్ ప్లేయర్లను రిప్లేస్ చేసేందుకు కావాల్సినంత మంది ప్లేయర్లు ఉన్నారు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

click me!

Recommended Stories