శిఖర్ ధావన్ దెబ్బకు రూ.7 కోట్లు కోల్పోయిన యూట్యూబర్... అర్ష్‌దీప్ సింగ్‌ని నమ్ముకుని బెట్ వేస్తే...

Published : May 19, 2023, 03:25 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు శిఖర్ ధావన్. గత మూడు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి మూడో కెప్టెన్ ధావన్.  స్టార్ ప్లేయర్లు పుషల్కంగా ఉన్నా, సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది పంజాబ్ కింగ్స్...  

PREV
18
శిఖర్ ధావన్ దెబ్బకు రూ.7 కోట్లు కోల్పోయిన యూట్యూబర్... అర్ష్‌దీప్ సింగ్‌ని నమ్ముకుని బెట్ వేస్తే...
preity zinta

మిగిలిన టీమ్స్ కంటే 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కే ప్లేఆఫ్స్ ఛాన్సులు ఎక్కువగా ఉండే.. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓడి వాటిని నాశనం చేసుకుంది. ఢిల్లీపై మ్యాచ్ గెలిచి ఉంటే, రాజస్థాన్ రాయల్స్‌పై విజయం అందుకుంటే 16 పాయింట్లతో పంజాబ్ ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుని ఉండేది..

28
Image credit: PTI

అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ అండ్ టీమ్ మేనేజ్‌మెంట్ కలిసి చెత్త స్ట్రాటెజీతో పంజాబ్ కింగ్స్‌ పరాజయానికి కారణమయ్యారు. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌, ఆ తర్వాత సరిగ్గా వికెట్లు తీయలేకపోయాడు...
 

38
Image credit: PTI

అర్ష్‌దీప్ సింగ్‌కి పవర్ ప్లేలో కానీ, డెత్ ఓవర్లలో కానీ బౌలింగ్ రాకపోవడమే అతని పర్ఫామెన్స్ దిగజారడానికి ప్రధాన కారణం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సామ్ కుర్రాన్, కగిసో రబాడాతో ఓపెనింగ్ స్పెల్స్ వేయించిన శిఖర్ ధావర్, అర్ష్‌దీప్ సింగ్‌తో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాడు.
 

48
Image credit: PTI

భారీగా పరుగులు సమర్పించిన నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహార్‌లతో పూర్తి ఓవర్లు వేయించిన శిఖర్ ధావన్, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యత స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌కి ఇచ్చాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు రాబట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇదే మ్యాచ్ రిజల్ట్‌ని మార్చేసింది..
 

58
Image credit: PTI

3 ఓవర్లు వేసిన కగిసో రబాడాకి కానీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అర్ష్‌దీప్ సింగ్‌కి కానీ చివరి ఓవర్ ఇచ్చి ఉంటే పంజాబ్ కింగ్స్‌కి విజయావకాశాలు ఎక్కువగా ఉండేది. అయితే చెత్త కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్‌ ఓటమికి మాత్రమే కాదు, ఓ యూట్యూబర్ రూ.7 కోట్లు నష్టపోవడానికి కారణమయ్యాడు శిఖర్ ధావన్..

68
Image credit: PTI

ఫాంటసీ క్రికెట్ ఎక్స్‌పర్ట్, యూట్యూబర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అనురాజ్ ద్వివేదీ, ఫాంటసీ టీమ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ని కెప్టెన్‌గా పెట్టుకుని... భారీగా బెట్టు వేశాడు. శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్‌ని సరిగ్గా వాడుకోకపోవడం వల్ల అతనికి రూ.7 కోట్ల నష్టం వచ్చిందట...

78

ఇలా ఈ సీజన్‌లో అంచనాలకు అందని రిజల్ట్స్ కారణంగా క్రికెట్ బెట్టింగ్‌ రాయుళ్లకు భారీగా బొక్క పడిందని సమాచారం. ఆఖరి ఓవర్‌లో 31 పరుగులు చేధించి కేకేఆర్ అద్భుతం చేస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ వంటి టాప్ టీమ్స్ ఆఖరి ఓవర్‌లో 9, 11 పరుగులు చేయలేక ఓడిపోయాయి. 
 

88
(PTI Photo/Ravi Choudhary)(PTI05_13_2023_000485B)

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచులు మంచి మజాని అందిస్తున్నా, వీటిపై భారీగా పందెం కాస్తున్న బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం హాట్ అటాక్‌లు తెప్పిస్తున్నాయట.. 

click me!

Recommended Stories