రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని ఎందుకు అంటారో తెలుసా?

First Published | Oct 14, 2024, 8:57 AM IST

why Rohit Sharma is called a hitman: టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను హిట్‌మ్యాన్ అని పిలుస్తారని అందరికీ తెలుసు. ప్రపంచ వేదికపై భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మను ఎందుకు హిట్ మ్యాన్ అంటారు? రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Highest Individual Score in ODIs

అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు సాధించిన రోహిత్ శర్మ 

భారత క్రికెట్ లెజెండరీ ప్లేయర్లలో ఒకరు రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్ అతన్ని హిట్ మ్యాన్ అని పిలుస్తుంది. రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని పిలవడానికి అని దూకుడు శైలీ ఆట, అంతర్జాతీయ క్రికెట్ లో నే కాదు దేశీయంగా, అనేక క్రికెట్ లీగ్ లలో అతను సాధించిన పరుగుల రికార్డులు కారణం. అతను సాధించిన రికార్డుల గురించి తెలిస్తే నిజంగానే రోహిత్ శర్మ రియల్ హిట్ మ్యాన్ అని అంటారు. రోహిత్ శర్మ సాధించిన టాప్ క్రికెట్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Most Double Centuries in ODIs

వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ 

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు ఏకంగా వన్డే క్రికెట్‌లో మూడుసార్లు రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే, అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డును కూడా సాధించాడు. 

2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.


Most 150+ Scores in ODIs

వన్డేల్లో అత్యధిక 150+ స్కోర్లు సాధించిన రోహిత్ శర్మ 

టీ20 క్రికెట్, వన్డే క్రికెట్, టెస్టు క్రికెట్ ఇలా ఫార్మాట్ ఏదైనా రోహిత్ శర్మ బ్యాట్ పనిచేసిందంటే పరుగుల వరద పారడం ఖాయం. ఇప్పటికే అనేక రికార్డులు సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 150కి పైగా పరుగులు చేసిన ప్లేయర్ గా కూడా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. హిట్ మ్యాన్ రోహిత్ 8 సార్లు 150+ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులతో రోహిత్ శర్మ 

టీ20 క్రికెట్ లో బెస్ట్ ప్లేయర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత జట్టును అజేయంగా నిలిపాడు. ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోనివ్వకుండా టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. టీ20 ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 4,231 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

Most Sixes in International T20s

అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు  -  రోహిత్ శర్మ రికార్డు

రోహిత్ శర్మ భారత్ తరపున మొత్తం 159 టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ తర్వాత ఐర్లాండ్ కు చెందిన పీఆర్ స్టిర్లింగ్ 147 మ్యాచ్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ. 

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ

అత్యధిక మ్యాచ్ లు, అత్యధిక పరుగులతో పాటు అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా కూడా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో రోహిత్ శర్మ ఏకంగా 205 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ తప్ప మరే బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 200 సిక్సర్లకు దగ్గరగా కూడా రాలేదు.

Most Centuries in International T20s

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ 

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం 5 సెంచరీలు సాధించాడు. దీంతో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 600 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ మొత్తం 623 సిక్సర్లు బాదాడు.

Latest Videos

click me!