అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఏదో తెలుసా?

First Published | Sep 7, 2024, 9:48 PM IST

most valuable IPL franchise : ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్లుగా కొన‌సాగుతున్నాయి. ఈ రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు చెరో ఐదు సార్లు ఛాంపియ‌న్ గా నిలిచాయి. ఆ త‌ర్వాత కేకేఆర్ మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. 
 

Virat, Dhoni, Rohit

most valuable IPL franchise : ఐపీఎల్ 2025 కోసం ఇప్ప‌టికే బీసీసీఐ క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. రాబోయే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కు ముందు ఆట‌గాళ్ల కోసం మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. దీంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌తో ఇప్ప‌టికే బీసీసీఐ ప‌లు స‌మావేశాలు నిర్వ‌హించింది. 

ఐపీఎల్ 2025 కోసం కొత్త నిర్ణ‌యాలు, కొత్త రూల్స్ తీసుకురావ‌డానికి ఫ్రాంఛైజీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. అయితే, ప‌లు నిర్ణ‌యాల‌పై అన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఏకాభిప్రాయానికి రాక‌పోవ‌డంతో క్రికెట్ వ‌ర్గాల్లో మ‌రింత ఉత్కంఠ‌ను పెంచుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఐపీఎల్ జ‌ట్ల గురించి మ‌రో నివేదిక వైర‌ల్ గా మారింది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో ఘోరంగా విఫలమైంది. 2024లో ముంబై ఇండియ‌న్స్ ను ఐదు సార్లు ఛాంపియ‌న్ గా నిల‌బెట్టిన రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించి ముంబై జ‌ట్లు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసింది. 

కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియ‌న్స్ కు నాయకత్వం వహించాడు, కానీ అతను ఫ్రాంచైజీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. లెజెండరీ రోహిత్ శర్మను కెప్టెన్‌గా భర్తీ చేసిన తర్వాత అతని వైఫల్యానికి చురకలంటించాడు. అదే స‌మ‌యంలో ముంబై ఫేమ్ పై కూడా మ‌చ్చ ప‌డింది. క్రికెట్ ల‌వ‌ర్స్ నుంచి, ముఖ్యంగా రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు, ట్రోల్స్ ను ఎదుర్కొంది.


అయిన‌ప్ప‌టికీ ముంబై ఇండియ‌న్స్ జట్టు ఇప్పటికీ ఆర్థిక పలుకుబడి పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. డీ అండ్ పీ అడ్వైజరీ నుండి వచ్చిన నివేదిక ప్రకారం ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియ‌న్స్ అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా ఉంది. 

ముంబై ఇండియ‌న్స్ వాల్యుయేషన్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ముంబైకి చివరి టైటిల్ 2020లో వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా జట్టు నిలకడ కోసం కష్టపడుతోంది. కానీ, మెరుగైన ఫ‌లితాలు సాధించ‌డంలో విఫ‌ల‌మ‌వుతూనే ఉంది. 

ముంబై ఇండియ‌న్స్ త‌ర్వాత చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు రెండవ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఉంది. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయ‌క‌త్వంలో చెన్నై టీమ్ ఐపీఎల్ లో విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా ముందుకు సాగింది. ఐదు సార్లు ధోని చెన్నై టీమ్ ను ఛాంపియ‌న్ గా నిలిపాడు. 

అయితే, గ‌త సీజ‌న్ (ఐపీఎల్ 2024) లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోని త‌ప్పుకున్నాడు. అత‌ని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీని అప్ప‌గించింది సీఎస్కే. ధోని ఐపీఎల్ 2024 లో ప్లేయ‌ర్ గా జట్టులో కొన‌సాగాడు. అయితే, ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ధోని ప్లేయ‌ర్ గా ఉంటాడా?  లేదా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. 

ప్ర‌స్తుతం ఐపీఎల్ లో అత్యంత విలువైన ఫ్రాంఛైజీలుగా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్ జట్లు మ‌ళ్లీ త‌మ విజ‌య‌యాత్ర‌ను రాబోయే సీజ‌న్ తో మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాయి. ఐపీఎల్ 2025లో ఈ జ‌ట్ల‌ను ఛాంపియ‌న్ గా చూడాల‌ని ఇరు జ‌ట్ల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల త‌ర్వాత గ‌త సీజ‌న్ లో (ఐపీఎల్ 2024) ఛాంపియ‌న్ గా నిలిచిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఐపీఎల్ లో అత్యంత విలువైన జ‌ట్ల లో మూడో స్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నాలుగో స్థానంలో నిలిచింది.

ఇదిలావుండ‌గా, ఐపీఎల్ మొత్తం వాల్యుయేషన్ 10.6 శాతం క్షీణించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనికి విరుద్ధంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వాల్యుయేషన్ లు పెరుగుతున్నాయి. 

క్యాష్ రిచ్ లీగ్ విలువ 2023లో 92,500 కోట్లు కాగా, ఇప్పుడు అది 82,700 కోట్ల‌కు తగ్గింది. డ‌బ్ల్యూపీఎల్ దాని వాల్యుయేషన్‌లో 8 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు ఏడాది 1250 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1350 కోట్లకు చేరుకుంది.

Latest Videos

click me!