Josh Inglis fastest T20 Century : ఎడిన్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్కాటిష్‌ల ఆశలను చిత్తు చేస్తూ జోష్ ఇంగ్లిస్ అద్భుతమైన సెంచరీని సాధించాడు. అంతర్జాతీయ టీ20 లలో అతనికి ఇది రెండో సెంచరీ. ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ గా టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీగా ఇది నిలిచింది.
ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. 103 పరుగుల తన సెంచరీ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా తరఫున టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది.
197 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన స్కాట్లాండ్ కు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు ఆ జట్టు ఓపెనర్లు. అయితే, ఆ తర్వాత ఛేజింగ్‌లో చాలా వెనుకపడిపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.