2012 డిసెంబరులో వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ టెండూల్కర్, 2013, అక్టోబరులో టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 10వ నెల, 10వ తారీఖున 10 నెంబర్ జెర్సీ ధరించే సచిన్ టెండూల్కర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రకటించాడు. నవంబర్ 16, 2013న తన ఆఖరి అంతర్జాతీయ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఆడి క్రికెట్ ప్రస్తానానికి ముగింపు పలికాడు సచిన్ రమేశ్ టెండూల్కర్.