పెళ్లికి ముందు రోహిత్ శర్మ ఆ మూవీ చూసి ఏడ్చేవాడు... దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్...

Published : Aug 12, 2021, 04:34 PM IST

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్, తనదైన స్టైల్‌లో అభిమానులను అలరిస్తున్నాడు. తొలి టెస్టు సమయంలో విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకి తీసుకొచ్చిన కార్తీక్, ఇప్పుడు రోహిత్ శర్మతో ఇంటర్వ్యూ చేశాడు...

PREV
19
పెళ్లికి ముందు రోహిత్ శర్మ ఆ మూవీ చూసి ఏడ్చేవాడు... దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్...

లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టు సమయంలో రోహిత్ శర్మతో దినేశ్ కార్తీక్ చేసిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ కానుంది. అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ చిన్న క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు దినేశ్ కార్తీక్...

29

‘రోహిత్ శర్మ పెళ్లికి ముందు సూర్యవంశం సినిమా చూసి ఏడ్చేసేవాడు... అలాంటి రోహిత్, రితికాతో పెళ్లైన తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్, హౌ ఐ టు మదర్... వంటి వెబ్‌సిరీస్‌లు చూస్తున్నాడు...

39

అసలు రితికాతో పెళ్లైన తర్వాత రోహిత్ శర్మలో ఇంత మార్పు ఎలా వచ్చింది... ఆ విషయాల గురించి కొంచెం చెప్పవా...’ అంటూ రోహిత్‌ను ప్రశ్నించాడు దినేశ్ కార్తీక్...

49

దినేశ్ కార్తీక్ అడిగిన ప్రశ్నకి కాస్తా సిగ్గు పడుతూ నవ్వేసిన రోహిత్ శర్మ... ‘నీ ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారో చెప్పు... ’ అంటూ అడిగాడు. పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి రోహిత్ సమాధానం తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడాల్సిందే...

59

‘హిట్ మ్యాన్’గా క్రికెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ విశాఖపట్నం ఏరియాకి చెందినది. రోహిత్‌కి తెలుగు కూడా కొద్దికొద్దిగా వచ్చు... 

69

రోహిత్ కూడా తన మాతృభాష తెలుగు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే దినేశ్ కార్తీక్ తమిళుడు అయినా అతనికి తెలుగు కూడా బాగా వచ్చు... 

79

స్పోర్ట్స్ మేనేజర్‌గా విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లకు పనిచేసిన రితికా సజ్దేపై మనసు పడిన రోహిత్ శర్మ... 2015, డిసెంబర్ 13న ఆమెను పెళ్లాడాడు... వీరికి సమైరా అనే కూతురు కూడా ఉంది...

89

విదేశాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేని రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ టూర్‌లో రాణించి... ఫారిన్ పిచ్‌లపైన కూడా సత్తాచాటగలనని నిరూపించుకోవాలని చూస్తున్నాడు... 

99

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు...

click me!

Recommended Stories