శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ ఫీల్ అవుతూ ఉండొచ్చు, అందులో వారి తప్పు లేదు...

First Published Nov 18, 2021, 4:58 PM IST

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఒకనాక దశలో భారత బ్యాటర్లు సునాయాసంగా 15 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించేస్తారనుకున్నా, ఆఖరి ఓవర్‌ దాకా సాగి ఉత్కంఠ రేగింది...

టాపార్డర్‌లో కెఎల్ రాహుల్ పర్వాలేదనిపించినా... రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఈజీ విక్టరీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించింది భారత జట్టు...

అయితే రోహిత్ శర్మ అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, అతను అవుటైన తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ పెద్దగా రాణించలేకపోయారు...

‘శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో పెద్దగా రాణించలేకపోయారు. వాళ్లు క్రీజులోకి వచ్చే సమయానికి మ్యాచ్ దాదాపు ముగిసిపోయే పొజిషన్‌కి చేరుకుంది...

ఎక్కువ ఓవర్లు మిగిలి ఉన్నా, ఎక్కువ పరుగులు చేయాల్సి ఉన్నా ఈ ఇద్దరి నుంచి మంచి ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం దక్కి ఉండేది. అయితే ఆఖర్లో రావడం, విన్నింగ్స్ రన్స్ చేయలేకపోవడంతో ఫీల్ అవుతూ ఉండొచ్చు...

డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తమ కెరీర్‌లో ఎన్నో ఫెయిల్యూర్స్‌ని చూశారు. అలాంటి వాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండడం, ఈ ఇద్దరు అయ్యర్‌లలో పాజిటివిటీ నింపొచ్చు...

చాలా కూల్‌గా, కేవలం ఒక్క గేమ్ మాత్రమే అయ్యిందని ఈ ఇద్దరూ... ప్లేయర్లకు చెబుతారు. కొన్నిసార్లు విజయానికి కావల్సిన పరుగులు కూడా చేయలేనప్పుడు మనపై మనకే నమ్మకం తగ్గిపోతుంది...

అయితే ఇలాంటి పరిస్థితుల్లో అవి పెద్ద విషయం కాదు. ఎందుకంటే కెప్టెన్ రోహిత్, తన కెరీర్‌లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ద్రావిడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు...

కెరీర్ ఆరంభంలో ఫెయిల్ అవుతున్న ప్లేయర్లు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఈ ఇద్దరినీ స్ఫూర్తిగా తీసుకుంటే చాలు, పాజిటివ్ థింకింగ్ దానంతట అదే పెరుగుతుంది...

వెంకటేశ్ అయ్యర్‌, బ్యాటింగ్ ఆర్డర్‌లో కింద రావడాన్ని ఫీల్ అవ్వొచ్చు. అయితే ఇప్పుడు ఓపెనర్‌గా ఉన్న రోహిత్ శర్మ కూడా కెరీర్ ఆరంభంలో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసినవాడే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...

click me!