Dinesh Karthik: కార్తీక్ రికార్డుల మోత.. నాటి నుంచి నేటి దాకా ఘనత

First Published Jun 18, 2022, 10:02 AM IST

IND vs SA T20I: టీమిండియా వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో  అంచనాలకు మించి రాణిస్తున్నాడు. శుక్రవారం రాజ్కోట్ లో జరిగిన నాలుగో టీ20 లో కార్తీక్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 
 

అది 2006.. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. డిసెంబర్ 1న  అక్కడ  సఫారీలతో  ఏకైక టీ20 ఆడింది. భారత జట్టుకు అదే తొలి టీ20 మ్యాచ్. అప్పటివరకు టెస్టులు, వన్డేలకు అలవాటుపడ్డ భారత ఆటగాళ్లు ఎలా ఆడతారా..? అని అందరిలోనూ ఉత్కంఠ.. కానీ ఆ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

కట్ చేస్తే.. 2022.. జూన్ 17. రాజ్కోట్ లో అదే దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నాలుగో వన్డే. టీమిండియాకు ఇది 163వ టీ20 మ్యాచ్. సంఖ్యాపరంగా చూస్తే ఇదేం పెద్ద ప్రాధాన్యమున్న మ్యాచ్ కాదు. కానీ సిరీస్ పరంగా చూస్తే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ సిరీస్ ను కాపాడుకుంటుంది.

Latest Videos


అయితే తొలుత తడబడిన భారత్.. తర్వాత పుంజుకుంది. భారత్ పుంజుకోవడానికి  ఓ  వెటరన్ ఆటగాడు కారణమయ్యాడు. అతడు వచ్చాడు.. బాదాడు..  వెళ్లాడు.. టీమిండియా విజయం సాధించింది.  దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసింది. మ్యాచ్ అనంతరం అతడు  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

ఆ వెటరన్  మరెవరో కాదు.. టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్. వయసు మీద పడుతున్నా తనలో దూకుడు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ  భారత్ కు  అవసరమైన సమయంలో విజయం అందించాడు. కాగా నాడు ఇండియా ఆడిన తొలి మ్యాచ్ లో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (28 బంతుల్లో 31 పరుగులు) దక్కగా.. శుక్రవారం సఫారీలతో ఆడిన మ్యాచ్ లో కూడా కార్తీక్ కే ఆ అవార్డు వరించింది.

16 ఏండ్ల  టీమిండియా (కార్తీక్) టీ20 కెరీర్ లో చాలామంది ఆటగాళ్లు వచ్చారు. వెళ్లారు. 2006 లో  ఇండియా తొలి టీ20 ఆడిన వారిలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ తప్ప మరెవ్వరూ జట్టులో లేరు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్ తో సహా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లు అప్పటికి ఇంకా సరిగా బ్యాట్ కూడా పట్టుకోలేని వయసులో ఉండుంటారు. 

కాగా.. 37 ఏండ్ల వయసులో  హాఫ్  సెంచరీ చేసిన  కార్తీక్.. టీ20 లలో భారత్ తరఫున లేటు వయసులో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.  అంతకుముందు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. 2018లో ఇదే సఫారీ జట్టు మీద ధోని.. 36 ఏండ్ల 229 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు.  ప్రస్తుతం కార్తీక్ వయసు 37 ఏండ్ల 16 రోజులు. 
 

ఇక 16 ఏండ్ల టీ20 కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన  కార్తీక్.. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే వచ్చే టీ20 ప్రపంచకప్ లో భారత్ కు  ఓ మెరుగైన ఫినిషర్ దొరికనట్టే.  

ఇక 16 ఏండ్ల టీ20 కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన  కార్తీక్.. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే వచ్చే టీ20 ప్రపంచకప్ లో భారత్ కు  ఓ మెరుగైన ఫినిషర్ దొరికనట్టే.  

ఇక టీమిండియా ఆడిన తొలి T20 మ్యాచ్ నుంచి మొదలు కీలక సందర్భాల్లో కార్తీక్ జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో  కార్తీక్ సభ్యుడు. 2016లో నిదాహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ పై అతడు చేసిన విధ్వంసం ఇంకా అభిమానుల కండ్ల ముందు కదులుతూనే ఉంది. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో  కూడా అదే ఆటను ఆడి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు కార్తీక్.. 

click me!