ఆలస్యం కాకముందే అతన్ని ఆడించండి... సూర్యకుమార్ యాదవ్‌కి నాలుగో టెస్టులో...

First Published Aug 29, 2021, 3:41 PM IST

మొదటి మూడు టెస్టుల్లో టీమిండియాలో పెద్దగా మార్పులు జరగలేదు. తొలి టెస్టుకి ముందు మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అతని స్థానంలో ఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వడంతో... మొదట ఓపెనర్‌గా అనుకున్న మయాంక్‌కి కూడా అవకాశం రాలేదు...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగి, భారీ మూల్యం చెల్లించుకున్న విరాట్ సేన, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మూడు టెస్టుల్లోనూ నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగింది...

మొదటి టెస్టులో మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా, గాయం కారణంగా రెండో టెస్టు ఆడని శార్దూల్ ఠాకూర్ కూడా విన్నింగ్ కాంబినేషన్ రిపీట్ చేయాలని కోహ్లీ భావించడంతో మూడో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

మొదటి రెండు టెస్టుల్లో ఫెయిల్ అయిన ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే స్థానంలో పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా కోహ్లీ మాత్రం ఇప్పటిదాకా అలాంటి సాహసం చేయలేదు...

మూడో టెస్టులో 78 పరుగులకే కుప్పకూలిన టీమిండియా, మిగిలిన రెండు టెస్టుల్లో గెలవాలంటే బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్...

‘మన బౌలింగ్ బాగుంది. కానీ బ్యాటింగ్‌లో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలస్యం కాకముందే భారత తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్‌ని తీసుకురావాల్సిన అవసరం ఉంది...

హనుమ విహారి టెస్టుల్లో బాగా ఆడగలడు... అయితే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాలంటే విహారి కంటే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఆప్షన్...

అవసరమైతే ఓ బౌలర్‌ను తగ్గించి, ఆరుగురు బ్యాట్స్‌మెన్లతో కూడా ఆడొచ్చు. సూర్య తన స్కిల్స్‌తో టెస్టుల్లోనూ స్థానం పదిలం చేసుకోగలడు...

ఇప్పటికే అతన్ని ఆడించాల్సింది. ఇంకా ఆడించకుండా పక్కన కూర్చోబెడితే ఆలస్యం అయిపోద్ది... అప్పుడు ఆడించినా, రావాల్సిన ఫలితం దక్కదు...

రవిచంద్రన్ అశ్విన్‌లాంటి ప్లేయర్‌ను ఎందుకు పక్కనబెడుతున్నారనేది ఇప్పటికీ నాకు అంతుచిక్కడం లేదు. టీమ్‌లో ఉన్న బెస్ట్ స్పిన్నర్‌ను పక్కనబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా...

మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవాలంటే టీమిండియా కచ్ఛితంగా ఆరుగురు బ్యాట్స్‌మెన్లు, నలుగురు బౌలర్లు, ఓ వికెట్ కీపర్‌తో బరిలో దిగాలి...’ అంటూ కామెంట్స్ చేశారు దిలీప్ వెంగ్‌సర్కార్...

click me!