అతనికి బౌలింగ్ చేయలేక తల పట్టుకున్న అండర్సన్... మయంతి లంగర్ పోస్టు చేసిన ఫోటోకి...

First Published Aug 29, 2021, 1:07 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 78, రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇన్నింగ్స్ తేడాతో ఓడారు. ఈ సమయంలో క్రికెట్ యాంకర్ మయంతి లంగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ స్టోరీ హాట్ టాపిక్ అయ్యింది...

మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ముప్పుతిప్పలు పెట్టాడు. మొదటి ఓవర్‌లోనే కెల్ రాహుల్‌ను అవుట్ చేసిన అండర్సన్, ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారాను పెవిలియన్ చేర్చాడు.

అండర్సన్ దెబ్బకు 4 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్ చేరడంతో 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ కూడా పెద్దగా రాణించకపోవడంతో 78 పరుగులకే కుప్పకూలి, చెత్త రికార్డు మూటకట్టుకుంది...

తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్టన్, రాబిన్‌సన్, మొయిన్ ఆలీ తీసిన వికెట్లు ఒక ఎత్తు అయితే... ఆరంభంలో 8 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే 3వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ స్పెల్ మరో ఎత్తు. ఈ స్పెల్ కారణంగానే భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయి, ఒత్తిడికి గురై వరుస వికెట్లను చేజార్చుకుంది...

మూడో టెస్టులో టీమిండియా ఓడిన సమయంలో హాట్ యాంకర్ మయంతి లంగర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ స్టోరీ హాట్ టాపిక్ అయ్యింది...

స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ వేయలేక జేమ్స్ అండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాలో స్టోరీగా పోస్టు చేసింది ఆయన భార్య మయంతి... 

టీమిండియా తరుపున 6 టెస్టులు ఆడిన స్టువర్ట్ బిన్నీ, ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కలిగిన బౌలర్ కూడా స్టువర్ట్ బిన్నీయే...

2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన స్టువర్ట్ బిన్నీ, ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లేని రికార్డును బ్రేక్ చేసి, టీమిండియా తరుపున బెస్ట్ గణాంకాలు నమోదుచేశాడు..

2014 ఇంగ్లాండ్ టూర్‌లో తొలి టెస్టు ఆడిన స్టువర్ట్ బిన్నీ, మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండ ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మయంతి పోస్టు చేసిన పిక్, ఆ ఇన్నింగ్స్ లోదే...

స్టోరీలో మయంతి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా... ఇంగ్లాండ్‌లో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా కాదని, దానికి తన భర్తలా సపరేట్ టాలెంట్ ఉండాలని పరోక్షంగా చెబుతున్నట్టుగా ఈ పిక్ ఉందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ, క్రికెట్ యాంకర్ మయంతి లంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు...

37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ, ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లతో 32 పరుగులు సమర్పించాడు...

టీమిండియా తరుపున వన్డేల్లో బెస్ట్ గణాంకాలు మాత్రమే కాకుండా, టీ20ల్లో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డు కూడా నమోదుచేసిన బిన్నీకి ఆ మ్యాచ్ తర్వాత మరో ఛాన్స్ దక్కలేదు...
 

click me!