ధోనీ అస్సలు కూల్, కామ్ పర్సన్ కాదు! విరాట్ కోహ్లీతో పాటు అందర్నీ తిడతాడు... ఇషాంత్ శర్మ షాకింగ్ కామెంట్స్..

First Published Jun 26, 2023, 7:01 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అందరూ ‘కెప్టెన్ కూల్’, ‘మిస్టర్ కూల్’ అని పిలుస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా కూల్‌గా, కామ్‌గా ఉంటాడని ఇలా పిలుస్తారు. అయితే ధోనీ అందరూ అనుకునేంత కూల్ కాదంటున్నాడు ఇషాంత్ శర్మ..

రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఇషాంత్ శర్మ, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడు. 2021 న్యూజిలాండ్ సిరీస్ తర్వాత ఇషాంత్ శర్మను పూర్తిగా పక్కనబెట్టేసింది టీమిండియా..

‘ధోనీ సైలెంట్‌గా ఓ మూలకు కూర్చొన్నాడంటే అతను తన జోన్‌లో ఉన్నాడని అర్థం. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆ టైమ్‌లో ఏ ప్లేయర్ అయినా వెళ్లి, ఏదైనా అడిగాడో అంతే... వాడి పని అయిపోయిందే...
 

Latest Videos


అందరూ ధోనీని కూల్, కామ్ అంటారు కానీ మాహీ అందరూ అనుకునేంత కూల్ ఏమీ కాదు. అలాగని అతనికి అంత ఎక్కువ కోపం కూడా రాదు. నా మీద కూడా ఫీల్డ్‌లో చాలా సార్లు అరిచాడు.. ఒకటి రెండు సార్లు భయపడ్డాను కూడా..

నేను వేసిన త్రో, అతని గ్లవ్స్ దాకా వెళ్లలేదంటే మాహీకి కోపం వస్తుంది. చేతుల్లోకి ఇవ్వు అని అరుస్తాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో నేను చేసిన ఓ తప్పుకి ధోనీకి విపరీతమైన కోపం వచ్చింది...

ఇయాన్ మోర్గాన్, రవి బోపారా ఇద్దరూ క్రీజులో సెటిల్ అయిపోయారు. కొట్టాల్సిన టార్గెట్ ఏమో చాలా తక్కువుంది. జడేజా బౌలింగ్ సమయంలో నేను మిడ్ ఆన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. అతను భారీ షాట్ ఆడతాడని అనుకున్నా..

అతనేమో మిడ్ వికెట్ మీదగా షాట్ ఆడాడు. నేను వెళ్లి క్యాచ్ అందుకునేలోపు అది నేల మీద పడడం, బోపారా రెండు పరుగులు తీయడం జరిగిపోయాయి. దాంతో ధోనీ నా వైపు చాలా కోపంగా చూశాడు. నాకు పరిస్థితి అర్థమైపోయింది..

Ishant Sharma

ఒక్క మాట కూడా అనలేదు. ఆ కళ్లను చూసే నాకు పరిస్థితి అర్థమైపోయింది. అయితే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నువ్వు ఫీల్డింగ్ చేయలేకపోతే అక్కడ నిలబడకు అన్నాడు. దాంతో నేను సైలెంట్‌గా వెళ్లి, నిలబడ్డా..

ధోనీ తన ప్లేయర్లపై కోపడతాడు. నాతో పాటు విరాట్ కోహ్లీని కూడా చాలా సార్లు తిట్టాడు. అయితే తిట్టిన తర్వాత తమ్ముడిలా అనుకుని చెప్పానని అంటాడు. ఎందుకిలా ఊరికే తిడతావని ఓ సారి అడిగితే, నాకు నువ్వంటే అంత ఇష్టం అని చెప్పాడు..

Ishant Sharma

అతనెప్పుడూ బౌలింగ్ మీటింగ్‌కి రాడు. అది తన పని కాదని అనుకుంటాడు. పరిస్థితిని బట్టి ఫీల్డ్‌లో ఏం చేయాలో అది నన్ను చేయనివ్వండి అంటాడు. ఆస్ట్రేలియాతో ఆడిన శిఖర్ ధావన్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతను గాయపడ్డాడు..

ishant

బొటనవేలు నలిగిపోయింది, అతను బ్యాటింగ్‌కి రాని పరిస్థఇతి. అప్పటికే చీకూ (కోహ్లీ) కూడా అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్ ఎలాగో గెలిచాం. తర్వాత నీకు ధావన్ పరిస్థితి తెలిసి కూడా ఎందుకు అలాంటి షాట్ ఆడావని కోహ్లీని అడిగాడు... ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది..’ అంటూ చెప్పుకొచ్చాడు భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ...

click me!