సీఎస్‌కేను చిత్తు చేసిన యంగ్ ఢిల్లీ... భారీ టార్గెట్‌ను ఎంతో ఈజీగా...

First Published Apr 10, 2021, 11:21 PM IST

ఐపీఎల్ 2021లో కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తిన రిషబ్ పంత్, ఆడిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేస్తూ అద్భుత విజయం అందుకున్నాడు. చెన్నై విధించిన 189 పరుగుల భారీ టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ కొట్టేసింది ఢిల్లీ క్యాపిటల్స్...18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్...

భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీకి యంగ్ ఓపెనర్ పృథ్వీషా, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కలిసి అద్భుతమైన ఆరంభం అందించారు... బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు ఈ ఇద్దరూ...
undefined
మొదటి వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన పృథ్వీషా, శిఖర్ ధావన్, 2015లో రాజస్థాన్ రాయల్స్ తరుపున రహానే, వాట్సన్ కలిసి నెలకొల్పిన 144 పరుగుల భాగస్వామ్యం తర్వాత సీఎస్‌కేపై ఐపీఎల్‌లో అత్యధిక పార్టనర్‌షిప్ నమోదుచేశారు...
undefined
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున శిఖర్ ధావన్, పృథ్వీషా నెలకొల్పిన ఈ శతాధిక భాగస్వామ్యం మూడో అతిపెద్దది కావడం మరో విశేషం...
undefined
2008లో సీఎస్‌కేపై ఢిల్లీ ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ హాఫ్ సెంచరీలు చేయగా, మళ్లీ ఇన్నేళ్లకు చెన్నైపై ఇద్దరు ఢీసీ ఓపెనర్లు హాఫ్ సెంచరీలు నమోదుచేసుకోవడం ఇదే తొలిసారి...
undefined
సీఎస్‌కేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన శిఖర్ ధావన్, ఐపీఎల్ కెరీర్‌లో 42వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు... ఐపీఎల్‌లో 600 ఫోర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు గబ్బర్...
undefined
38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసిన పృథ్వీషా... డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 138 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
undefined
54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు... అయితే అప్పటికే విజయానికి 21 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితికి చేరింది ఢిల్లీ...
undefined
మార్కస్ స్టోయినిస్, రిషబ్ పంత్ కలిసి లాంఛనాన్ని ముగించారు. స్టోయినిస్ 14 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 15 పరుగులు చేశాడు...
undefined
గత సీజన్‌లో ఢిల్లీ చేతిలో రెండు మ్యాచుల్లోనూ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది వరుసగా మూడో ఓటమి కాగా... కెప్టెన్‌గా సీఎస్‌కేపై మొదటి మ్యాచ్ ఆడుతూ విజయం అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్...
undefined
click me!