సురేశ్ రైనా ఆడితే ఇలా ఉంటుంది... రీఎంట్రీలో అదరగొట్టిన ‘చిన్న తలా’...

First Published Apr 10, 2021, 10:38 PM IST

‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు చాలా స్పెషల్ ప్లేయర్ సురేశ్ రైనా... అంతర్జాతీయ కెరీర్‌లో టీమిండియాకి ఎలా ఆడినా, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడినప్పుడు మాత్రం చెలరేగిపోతాడు సురేశ్ రైనా. గత ఏడాది ఐపీఎల్ ఆడలేకపోయిన రైనా, రీఎంట్రీలో అదరగొట్టాడు...

7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా, మొయిన్ ఆలీతో కలిసి మూడో వికెట్‌కి 53, అంబటి రాయుడితో కలిసి నాలుగో వికెట్‌కి 63 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించాడు..
undefined
36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసిన సురేశ్ రైనా... జడేజాకి బౌలర్ అడ్డురావడంతో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.
undefined

Latest Videos


సురేశ్ రైనా ఇంకొద్దిసేపు ఉంటే, స్కోరు బోర్డును మరింత వేగంగా పరుగులు పెట్టించేవాడే.. అయితే ‘చిన్న తలా’ కమ్‌బ్యాక్ ఇచ్చిన విధానం, సీఎస్‌కే అభిమానులను సీనియర్ క్రికెటర్లను అమితంగా ఆకట్టుకుంది...
undefined
ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు యూఏఈ చేరుకున్న సురేశ్ రైనా, తన మామ ఇంటిపై దుండగల దాడి కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే...
undefined
2020 సీజన్‌లో సురేశ్ రైనాను బాగా మిస్ అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్‌‌లో చేతిలో వికెట్లు ఉన్నా 150 స్కోరు కొట్టేందుకే బాగా కష్టపడిన సీఎస్‌కే, ఈ మ్యాచ్‌లో 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా 188 పరుగుల భారీ స్కోరు చేసిందంటే దానికి రైనా ఇచ్చిన జోష్ కూడా ఓ కారణం...
undefined
‘గత సీజన్‌లో మేం మిస్ అయ్యింది ఇదే... గ్రేట్ కమ్‌ బ్యాక్ మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనాను ప్రశంసిస్తూ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్.
undefined
‘సూపర్ రైనా కింగ్... చెన్నై సూపర్ కింగ్స్... అద్భుతంగా ఆడావ్ చిన్న తలా...’ అంటూ ట్వీట్ చేశాడు సీఎస్‌కే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్...
undefined
టీ20 మిడిల్ ఓవర్లలో 3543 పరుగులు చేసిన సురేశ్ రైనా, క్రిస్ గేల్ (4264), ఏబీ డివిల్లియర్స్ (3698) తర్వాతి స్థానంలో నిలిచాడు... ఈ లిస్టులో ఉన్న ఒకే భారత ప్లేయర్ రైనా..
undefined
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు రనౌట్ అయిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు సురేశ్ రైనా. గంభీర్ 16 సార్లు, శిఖర్ ధావన్ 15 సార్లు రనౌట్ కాగా, రైనా రనౌట్ కావడం 14వ సారి...
undefined
ఐపీఎల్ కెరీర్‌లో 39వ హాఫ్ సెంచరీ బాదిన సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తర్వాత అత్యధిక సార్లు 40 సార్లు, 50+ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు...
undefined
click me!