CSKvsDC: భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... సురేశ్ రైనా గ్రాండ్ కమ్‌బ్యాక్...

First Published Apr 10, 2021, 9:19 PM IST

IPL 2021: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవరలలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘చిన్న తల’ సురేశ్ రైనా హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా ఆఖర్లో సామ్ కుర్రాన్, జడేజా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. 

ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్, ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే డుప్లిసిస్‌ను డకౌట్ చేశాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్.
undefined
మూడో ఓవర్ మొదటి బంతికే రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేసిన క్రిస్ వోక్స్‌, సీఎస్‌కేకి షాక్ ఇచ్చాడు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సీఎస్‌కే, పవర్ ప్లే ముగిసేసరికి 33 పరుగులు మాత్రమే చేయగలిగింది...
undefined
అయితే మొయిన్ ఆలీ, సురేశ్ రైనా కలిసి మూడో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన మొయిన్ ఆలీ... రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది, తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు.
undefined
అంబటి రాయుడితో కలిసి నాలుగో వికెట్‌కి 63 పరుగులు జోడించాడు సురేశ్ రైనా. 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన అంబటి రాయుడు, టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసిన సురేశ్ రైనా, రనౌట్‌గా అవుట్ అయ్యాడు. గత సీజన్‌లో పాల్గొనని రైనాకి, ఐపీఎల్‌లో ఇది 39వ హాఫ్ సెంచరీ కాగా, 40వ 50+ స్కోరు..
undefined
రైనా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, రెండో బంతికే డకౌట్ అయ్యాడు. అన్వేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఎమ్మెస్ ధోనీ... వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే...
undefined
చివరిసారిగా 2015లో ముంబైపై డకౌట్ అయిన ధోనీ, ఆరేళ్ల తర్వాత మళ్లీ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ రాయల్స్, ముంబైలపై ఒక్కోసారి డకౌట్ అయిన ధోనీ, ఢిల్లీపై రెండోసారి డకౌట్ అయ్యాడు.
undefined
ధోనీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్ కుర్రాన్ వస్తూనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టారు సామ్ కుర్రాన్, జడేజా...
undefined
15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన సామ్ కుర్రాన్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి బౌల్డ్ కాగా... 17 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన జడేజా నాటౌట్‌గా నిలిచాడు...
undefined
జడేజా, కుర్రాన్ కలిసి ఏడో వికెట్‌కి 27 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం జోడించగా క్రిస్ వోక్స్, అవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు.
undefined
click me!