IPL 2021: ముంబై ఇండియన్స్‌కి షాక్ ఇచ్చిన ఢిల్లీ... లో స్కోరింగ్ గేమ్‌లో

First Published Apr 20, 2021, 11:33 PM IST

వరుసగా రెండు లో స్కోరింగ్ మ్యాచుల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేసి విజయాలు అందుకున్న డిఫెండింగ్ ఛాంపియన్‌కి షాక్ ఇచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్. డిఫెండింగ్ ఛాంపియన్‌ను లో స్కోరుకే అవుట్ చేసిన ఢిల్లీ, స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి చేధించింది. 

138 పరుగుల స్వల్ప లక్ష్యచేధనతో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి శుభారంభం దక్కలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తొలిసారి తుదిజట్టులో చోటు దక్కించుకున్న జయంత్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పృథ్వీషా...
undefined
11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. లక్ష్యం చిన్నదే కావడంతో నెమ్మదిగా సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రాధాన్యం ఇచ్చాడు స్మిత్, ధావన్...
undefined
29 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన కిరన్ పోలార్డ్‌, ముంబైకి బ్రేక్ అందించాడు. అయితే టూ డౌన్‌లో వచ్చిన లలిత్ యాదవ్‌తో కలిసి స్లోగా బ్యాటింగ్ కొనసాగించాడు ధావన్...
undefined
42 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన శిఖర్ ధావన్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
undefined
8 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన రిషబ్ పంత్, బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో 115 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఢిల్లీ...
undefined
12 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్‌ వేసిన జస్ప్రిత్ బుమ్రా... రెండు నో బాల్స్ వేసినా జయంత్ యాదవ్, హెట్మయర్ భారీ షాట్స్ కొట్టలేకపోయారు... అయితే ఆ ఓవర్‌లో 10 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో విజయానికి 5 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది ఢిల్లీ...
undefined
కిరన్ పోలార్డ్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదిన హెట్మయర్, స్కోర్లను సమం చేయగా... ఆ తర్వాత బంతి నో బాల్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కి 6 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కింది. లలిత్ యాదవ్ 22 పరుగులు, హెట్మయర్ 14 పరుగులు చేశారు.
undefined
click me!