ఫిట్‌నెస్ టెస్టుకి వస్తావా? లేక ఐపీఎల్ నుంచి తప్పించమంటావా.. హార్ధిక్ పాండ్యాకి బీసీసీఐ వార్నింగ్...

Published : Mar 15, 2022, 02:26 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి రెండు వారాల ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు అందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్‌సీఏ) వచ్చి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సూచించింది బీసీసీఐ. ఈ క్యాంపుకి రాని భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి వార్నింగ్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు.

PREV
19
ఫిట్‌నెస్ టెస్టుకి వస్తావా? లేక ఐపీఎల్ నుంచి తప్పించమంటావా.. హార్ధిక్ పాండ్యాకి బీసీసీఐ వార్నింగ్...

సహజంగా అయితే ఐపీఎల్ కోసం ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసే క్యాంపుల్లో నెల రోజుల ముందే చేరి, ప్రాక్టీస్ మొదలెట్టేస్తారు ప్లేయర్లు. అయితే సుదీర్ఘ సీజన్ కావడంతో ఈసారి బీసీసీఐ ముందుజాగ్రత్త చర్యలు మొదలెట్టింది...

29

74 రోజుల పాటు సాగే ఐపీఎల్ 2022 సీజన్ కారణంగా భారత కీలక ఆటగాళ్లు... గాయలతో టీమిండియా మ్యాచులకు దూరం కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతో బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ క్యాంపు ఏర్పాటు చేసింది...

39

శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ వంటి ప్లేయర్లు... ప్రస్తుతం ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ క్యాంపులో పాల్గొంటున్నారు...

49

అయితే ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిందిగా బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వాటిని పెద్దగా పట్టించుకోలేదు... దీంతో ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాకపోతే, ఐపీఎల్ కూడా ఆడనిచ్చేది లేదంటూ హుకుం జారీ చేసింది బీసీసీఐ...

59

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న హార్ధిక్ పాండ్యా, బీసీసీఐ హెచ్చరికలతో ఆలస్యంగా అయినా ఎన్‌సీబీలో భారత జట్టు క్యాంపులో చేరాడు...

69

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న హార్ధిక్ పాండ్యా... ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి నిర్ణయించబడుతుంది...
 

79

బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా లేకపోయినా మెంటర్ ఎమ్మెస్ ధోనీ సిఫారసులతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కించుకున్నాడు హార్ధిక్ పాండ్యా. అయితే బ్యాటుతో కానీ, బంతితో కానీ ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయాడు..

89

ఇప్పటికే ఎన్‌సీఏలో 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంపుల పాల్గొన్న భారత ప్లేయర్ల, మార్చి 15న ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఫ్రాంఛైజీలతో కలవబోతున్నారు...
 

99

ఇదే సమయంలో ఎన్‌సీఏలోకి ఎంట్రీ ఇచ్చిన భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత మహారాష్ట్ర నుంచి ఐపీఎల్‌ కోసం ముంబైకి వచ్చి క్వారంటైన్‌లో గడుపుతాడు...
 

click me!

Recommended Stories