క్రిస్‌గేల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా... సిక్సర్ల వర్షం కురిపించాడు... శివమ్ దూబే వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, శ్రేయాస్ గోపాల్ వేసిన 14వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన దీపక్ హుడా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

2015లో ఏప్రిల్ 15న రాజస్థాన్ రాయల్స్ తరుపున 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన దీపక్ హూడా, ఆరేళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు రాజస్థాన్ రాయల్స్‌పై 20 బంతుల్లో అర్ధశతకం చేయడం విశేషం.

కెఎల్ రాహుల్‌తో కలిసి మూడో వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ హుడా... ఇన్నింగ్స్ కారణంగా ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయత్నించాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.

28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసిన దీపక్ హుడా, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, రియాన్ పరాగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు....

జనవరిలో సయ్యద్ ముస్తాక్ ఆలీ 2021 టోర్నీ సమయంలో బరోడా జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న దీపక్ హుడాకి, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాకి మధ్య గొడవ జరిగింది... ఈ కారణంగా ఆరంభానికి ముందురోజు అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు దీపక్ హుడా...

‘బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా, తనతో సరిగా ప్రవర్తించడం లేదని... తాను స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి అందరి ముందు తిట్టాడని... బరోడా జట్టులో నేనేం చెబితే అదే వినాలని, నాకు చెప్పకుండా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావని’ తిట్టాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు దీపక్ హుడా...

అయితే దీపక్ హుడా ఫిర్యాదుపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ బోర్డు... అతనిదే తప్పు అంటూ టోర్నీ నుంచి తొలగిస్తున్నంటూ నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా ఏడాదిపాటు బరోడాకి ఆడకుండా నిషేధం విధించింది.

కరోనా కారణంగా బయో బబుల్‌లో నిర్వహించిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ నిర్వహించిన బీసీసీఐ, ఈ టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు బయటికి వెళ్లేందుకు, బయటి వ్యక్తులతో కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు.. అయితే దీపక్ హుడా తాను బయటికి వెళ్లాలంటూ, కృనాల్ పాండ్యాతో గొడవ పెట్టుకున్నాడని విచారణలో తేలినట్టు తెలిపింది.

ఈ సంఘటన తర్వాత దీపక్ హుడాకి పెద్దగా క్రికెట్ ఆడేందుకు అవకాశం కూడా దొరకలేదు. దీంతో కృనాల్ పాండ్యాతో ఆగ్రహంతో పగ తీర్చుకునేందుకు ఎదురుచూసిన దీపక్ హుడా, రాజస్థాన్ రాయల్స్‌పై ఆ కసి తీర్చుకున్నాడని అంటున్నారు నెటిజన్లు...

తొలి మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న దీపక్ హుడా, బౌలింగ్‌లో వికెట్లు తీస్తే... భారత టీ20 జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది...

ఇదే జరిగితే ఇప్పటికే టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్న కృనాల్ పాండ్యాకు చెక్ పడుతుంది. దీంతో తన ప్రదర్శనతో కృనాల్ పాండ్యాపై పగ తీర్చుకోవాలనే సంకల్పంతో దీపక్ హుడా పిచ్చి కొట్టుడు కొట్టాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

‘నేను కేవలం బాల్‌కి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యాను. నా బ్యాటింగ్‌లో పదును ఉందని చూపించాను. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నా. దేశవాళీ క్రికెట్‌లో నేను ఇదే పొజిషన్‌లో ఆడతా...’ అంటూ కామెంట్ చేశాడు దీపక్ హుడా...

బరోడా తరుపున 46 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన దీపక్ హుడా... 123 టీ20 మ్యాచుల్లో పాల్గొన్నాడు. మొత్తంగా దేశవాళీ క్రికెట్‌లో 5600లకు పైగా పరుగులు చేసిన దీపక్ హుడా గత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడాడు.