నా టార్గెట్ అతనొక్కడే! టీమిండియాలో నాకు పోటీ ఇవ్వరూ లేరంటున్న దీపక్ చాహార్... టీ20 కెప్టెన్ ప్లేస్‌కే...

First Published Feb 25, 2023, 11:56 AM IST

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ ఐసీసీ టోర్నీల్లో సూపర్ సక్సెస్ సాధించడానికి ఆల్‌రౌండర్లే కారణం.  కనీసం నలుగురు లేదా ఐదుగురు ఆల్‌రౌండర్లు ఉండేలా టీమ్‌ని సెలక్ట్ చేస్తాయి ఆ జట్లు. దీని వల్ల బౌలింగ్‌లో బ్యాటింగ్‌లో డెప్త్ ఉంటుంది. అయితే టీమిండియా అలా కాదు. టీమ్‌లో ఓ స్పిన్ ఆల్‌రౌండర్, ఓ ఫాస్ట్ బౌలర్ ఆల్‌రౌండర్.. అంతే!

Image credit: PTI

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ పూర్తి బ్యాటర్లు అయితే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సంజూ శాంసన్ పూర్తిగా వికెట్ కీపింగ్ బ్యాటర్లు. మిగిలిన వాళ్లు బౌలర్లు. బౌలర్లలో బ్యాటింగ్‌ వచ్చిన వాళ్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా మాత్రమే.. దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్ మెరుపులు మెరిపించినా టీమ్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకోలేకపోతున్నారు.. 

Image credit: PTI

‘టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకోవడం నాకు చాలా చిన్న విషయం. ఎందుకంటే టీమ్‌లో ఫాస్ట్ బౌలర్ల ఆల్‌రౌండర్లు చాలా తక్కువ. నేను దేశవాళీ టోర్నీల్లో నా రాష్ట్రానికి ఆడుతున్నప్పుడు నా ఆట చూసి అందరూ నవ్వేవాళ్లు..

Latest Videos


Image credit: PTI

అలాంటిది ఇప్పుడు నేను టీమిండియాకి ఆడేసరికి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు స్టేట్ టీమ్‌కే సరిగా ఆడని ప్లేయర్‌ని దేశానికి ఆడిస్తారని విమర్శలు కూడా చేశారు. అయితే నేను అవేమీ పట్టించుకోను. నా ఆటపైనే పూర్తి ఫోకస్ పెడతా...

Image credit: PTI

బ్యాటుతో, బంతితో నా వల్ల అయ్యింది చేయడమే నా కర్తవ్యం. బ్యాటింగ్ చేయగల ఫాస్ట్ బౌలర్ కోసం టీమిండియా ఎప్పుడూ తలుపులు తెరిచే పెడుతుంది. ఎందుకంటే టీమ్‌లో హార్ధిక్ పాండ్యా తప్ప మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడు..
 

Image credit: Getty

హార్ధిక్ పాండ్యా వరల్డ్ నెం.1 ఆల్‌రౌండర్. అతనికి టీమ్‌లో ఎప్పుడూ ప్లేస్ ఉంటుంది. ఆ పొజిషన్ దక్కించుకోవడమే నా ముందున్న టార్గెట్. ఐపీఎల్‌లో గత మూడు సీజన్లలో ఫస్ట్ బాల్ నేనే వేశాను. 2023 ఎడిషన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నాలుగో సారి ఫస్ట్ బాల్ వేయడానికి ఎదురుచూస్తున్నా...
 

Image Credit: Getty Images

అహ్మదాబాద్ జనాల మధ్య నేను, ఐపీఎల్ 2023 సీజన్ మొదటి ఓవర్ వేస్తున్నట్టు ఊహించుకుంటున్నా. టీమిండియాలోకి రావాలంటే ఐపీఎల్‌ ఒక్కటే మా ముందున్న మార్గం. ఈ సారి అవకాశాన్ని వదిలిపెట్టుకోను...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే ఆల్‌రౌండర్ దీపక్ చాహార్..

Deepak Chahar

గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి తప్పుకున్న దీపక్ చాహార్, ఐదు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. అంతకుముందు వెన్ను గాయంతో ఐపీఎల్ 2022 టోర్నీకి కూడా దూరమయ్యాడు దీపక్ చాహార్..

click me!