వేల కోట్ల క్రికెట్ బోర్డు, కోచ్‌ని పెట్టలేని పొజిషన్‌లో ఉందా!... హెడ్ కోచ్ లేకుండానే వరల్డ్ కప్ ఆడి..

Published : Feb 25, 2023, 10:35 AM ISTUpdated : Feb 25, 2023, 10:38 AM IST

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్. కేవలం ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయం ద్వారానే రూ.45 వేల కోట్లు సంపాదించింది బీసీసీఐ. మిగిలిన ఆదాయాలన్నీ కలిపితే భారత క్రికెట్ బోర్డు ఆదాయం లక్ష కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. అయితే భారత మహిళా టీమ్‌కి ఒక్క హెడ్ కోచ్‌ని నియమించలేని దుస్థితి..

PREV
110
వేల కోట్ల క్రికెట్ బోర్డు,  కోచ్‌ని పెట్టలేని పొజిషన్‌లో ఉందా!... హెడ్ కోచ్ లేకుండానే వరల్డ్ కప్ ఆడి..
Image credit: ICC

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. భారత బౌలింగ్, బ్యాటింగ్, ఆస్ట్రేలియాకి తక్కువ కాకుండా ఉన్నా ఫీల్డింగ్‌లో మాత్రం భారత జట్టు అనేక తప్పులు చేసింది. క్యాచ్ డ్రాప్‌ల కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంది..

210
Harmanpreet-Smriti

నిజానికి టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకి సరైన కోచ్ కూడా లేడు. బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, స్టాండ్ ఇన్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బౌలింగ్ కోచ్ కానీ ఫీల్డింగ్ కోచ్ కానీ లేకుండానే సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది భారత మహిళా జట్టు...

310
Harmanpreet tears

2014 నుంచి భారత మహిళా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌ల విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళా జట్టు తొలి రౌండ్ నుంచే నిష్కమించింది. దీంతో అప్పటిదాకా హెడ్ కోచ్‌గా ఉన్న సుధా షా ప్లేస్‌లో పూర్ణిమ రావుని హెడ్ కోచ్‌గా నియమించింది బీసీసీఐ...

410

పూర్ణిమా రావు హెడ్ కోచింగ్‌లో టీమిండియా తొలిసారి ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచింది. ఆసియా కప్ టైటిల్ గెలిచి, వరల్డ్ కప్‌కి అర్హత సాధించింది. అయితే 2017 వన్డే వరల్డ్ కప్‌కి రెండు నెలల ముందు పూర్ణిమా రావును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ... ఎందుకు ఇలా చేశారనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.

510
Harmanpreet Kaur-Smriti Mandhana

పూర్ణిమా రావు స్థానంలో బరోడా క్రికెటర్ తుషార్ అరోథ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. తుషార్ హెడ్ కోచింగ్‌లో టీమిండియా 2017 వన్డే వరల్డ్ కప్ ఆడి ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత ఏడాది అతన్ని కూడా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..

610
Image credit: PTI

డబ్ల్యూవీ రామన్, 2018లో భారత మహిళా జట్టుకి హెడ్ కోచ్‌‌గా నియమించబడ్డాడు. రామన్ హెడ్ కోచింగ్‌లో భారత మహిళా జట్టు, 2020 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కి చేరింది. అయితే రామన్ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత అతన్ని కొనసాగించేందుకు ఇష్టపడని బీసీసీఐ, రమేశ్ పవార్‌ని తీసుకొచ్చింది..
 

710

రమేశ్ పవార్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక అప్పటి టీమిండియా సారథి మిథాలీ రాజ్‌తో విభేదాలు వచ్చాయి. దీంతో అతని కాంట్రాక్ట్‌ గడువుని పొడగించేందుకు బీసీసీఐ ఇష్టపడలేదు. అయితే మిథాలీరాజ్ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్న సమయంలో మళ్లీ రమేశ్ పవార్‌ని తిరిగి హెడ్ కోచ్‌గా నియమించింది...

810
Image credit: Getty

రమేశ్ పవార్ హెడ్ కోచింగ్‌లో టీమిండియా 2022 వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్,  కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొంది భారత మహిళా జట్టు. అయితే వీవీఎస్ లక్ష్మణ్‌కి సాయంగా ఉండేందుకు రమేశ్ పవార్‌ని టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించి జాతీయ క్రికెట్ అకాడమీకి మార్చారు...
 

910

రాహుల్ ద్రావిడ్ అందుబాటులో లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచింగ్‌లో మ్యాచులు ఆడుతుంది టీమిండియా. ఐర్లాండ్ వంటి చిన్న టీమ్‌తో సిరీస్‌లు ఆడినప్పుడు కూడా హెడ్ కోచ్‌ని సంకలో పెట్టుకునే వెళ్లింది భారత పురుషుల జట్టు.. 

1010
Image credit: Getty

అలాంటిది టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్న భారత మహిళా జట్టుకి ఓ హెడ్ కోచ్‌ని నియమించలేకపోయింది బీసీసీఐ. ఉన్న హెడ్ కోచ్‌ని కూడా ఎన్‌సీఏకి మార్చి, మహిళా టీమ్‌పై ఎంత చిన్నచూపు ఉందో చూపించింది. భారత పురుషుల జట్టు కంటే మహిళా టీమ్ బాగా ఆడింది, ఆడుతోంది. మహిళా టీమ్‌కి ఆదరణ దక్కితే పురుషుల టీమ్ ద్వారా వస్తున్న వేల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని, అప్పుడు మహిళా క్రికెటర్లకు కూడా కోట్లలో వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఇలా వివక్ష చూపిస్తోందని అంటున్నారు అభిమానులు.. 

click me!

Recommended Stories