నేను ధోనీకి రైట్‌హ్యాండ్‌ని! అన్ని గెలిచినా ఫెయిల్యూర్ కెప్టెన్ అనేశారు... - విరాట్ కోహ్లీ

First Published Feb 25, 2023, 9:43 AM IST

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లకు అభిమానులు ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీకి భక్తులు ఉంటారు. భారత జట్టులో కూడా చాలామంది ధోనీ వీరాభిమానులే. అందులో విరాట్ కోహ్లీ పేరు లిస్టులో ఫస్ట్ ఉంటుంది...
 

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ, అతని తర్వాత టీమిండియాకి కెప్టెన్‌గా మారాడు. అండర్19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు దక్కడం వెనక ధోనీ హస్తం ఉంది...

‘‘ధోనీ నాకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మనం ధోనీని కలవాలంటే అతని దగ్గరికి వెళ్లాల్సిందే. అతని కాల్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు, ఎందుకంటే ఫోన్ ఎక్కడో పడేస్తాడు. దాన్ని అస్సలు పట్టించుకోడు. అందుకే నేను, ధోనీ ఎప్పుడో కానీ కలవము...

Latest Videos


అయితే లాస్ట్ ఇయర్ ధోనీ నాకు పంపిన మెసేజ్ ఎప్పటికీ మరిచిపోలేను. నేనేం చెప్పకపోయినా నేను ఏ పొజిషన్‌లో ఉన్నాడో, ఎలాంటి మెంటర్ టార్చర్ అనుభవిస్తున్నానో ధోనీ అర్థం చేసుకున్నాడు....

‘నువ్వు ఎప్పుడైతే దృఢంగా ఉండాలని అనుకుంటావో అప్పుడు నిన్ను దృఢమైన వ్యక్తిగా చూడు. ఎలాగంటే నీ చుట్టూ ఉన్నవాళ్లు ఎలా ఉన్నారని అడగడం కూడా మరిచిపోవాలి...’ అని మెసేజ్ పెట్టాడు..

ధోనీ పంపిన ఆ మెసేజ్, ఆ మాటలు, నాకు నా ఇంట్లోవాళ్లు చెప్పినట్టే అనిపించాయి. అతను చాలా స్ట్రాంగ్, మెంటల్ ఇంకా స్ట్రాంగ్. ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఢీల్ చేయగల వ్యక్తి. ధోనీ  నన్ను తన తర్వాత టీమ్‌ని నడిపించే వ్యక్తిగా చూశాడు..

మాహీ నన్ను సెలక్ట్ చేసుకోవడం వెనక మరే కారణం లేదు. నేను ఎప్పుడూ అతని రైట్ హ్యాండ్ పర్సన్‌గానే ఉన్నాను. మా ఇద్దరి మధ్య నమ్మకం, స్పష్టత చాలా ఎక్కువ. అందుకే మాహీతో నేను ఏ విషయాన్నైనా పంచుకోగలను..

నా కెప్టెన్సీలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి అర్హత సాధించింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఆడాం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా వెళ్లాం. అయినా నన్ను ఓ ఫెయిల్యూర్ కెప్టెన్‌గానే చూశారు...’’ అంటూ నవ్వేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ..

click me!