చెన్నై సూపర్ కింగ్స్‌కి షాకిచ్చిన దీపక్ చాహార్... రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన...

Published : Mar 03, 2022, 11:26 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కి షాక్ తగిలింది. మెగా వేలంలో రూ.14 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది...

PREV
110
చెన్నై సూపర్ కింగ్స్‌కి షాకిచ్చిన దీపక్ చాహార్... రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 14 వికెట్లు తీసిన దీపక్ చాహార్, ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో పవర్ ప్లేలో కీలక వికెట్లు తీసి గేమ్ ఛేంజర్‌గా మారాడు...
 

210

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 1.5 ఓవర్లలో 2 వికెట్లు తీసిన దీపక్ చాహార్, బౌలింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు...

310

గాయం కారణంగా తన స్పెల్‌లో రెండో ఓవర్ కూడా పూర్తి చేయలేకపోయిన దీపక్ చాహార్, శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...

410

దీపక్ చాహార్ గాయం తీవ్రతను గుర్తించిన వైద్యులు, అతనికి అయిన హర్మ్‌స్ట్రింగ్ ఇన్యూర్జీని టియర్ 1గా తేల్చారు... ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 8 నుంచి 10 వారాల వరకూ పడుతుంది...

510

ఇప్పటికే రెండు వారాలుగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్న దీపక్ చాహార్, మరో 6 నుంచి 8 వారాల పాటు క్రీజులో దిగలేడు. అంటే మరో 23 రోజుల్లో పాల్గొనే ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మేజర్ మ్యాచ్‌లకు చాహార్ దూరంగా ఉండబోతున్నాడు...

610

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫస్టాఫ్ ముగిసిన తర్వాతే చెన్నై సూపర్ కింగ్స్‌కి అందుబాటులో ఉండబోతున్నాడు దీపక్ చాహార్...

710

ఈ గాయం పూర్తిగా తగ్గకుండా బరిలో దిగితే గాయం తిరగబెట్టి, తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. సౌతాఫ్రికా టూర్‌కి ముందు రోహిత్ కూడా ఈ విధంగానే జట్టుకి దూరమైన విషయం తెలిసిందే. 

810

ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహార్‌ను రూ.14 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ కంటే రూ.2 కోట్లు ఎక్కువ తీసుకోబోతున్నాడు చాహార్...

910

గత సీజన్‌లో 21 వికెట్లు తీసి, చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్‌ కంటే కూడా దీపక్ చాహార్‌ను కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపించింది సీఎస్‌కే...

1010

శార్దూల్ ఠాకూర్‌ని రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. శార్దూల్ కోసం చివరిదాకా పంజాబ్ కింగ్స్ పోటీపడగా, చెన్నై మాత్రం భారీ ధర బిడ్ వేయడానికి ఆసక్తి చూపలేదు

Read more Photos on
click me!

Recommended Stories