గుజరాత్ టైటాన్స్‌లోకి సురేష్ రైనా?... జాసన్ రాయ్ స్థానంలో ఆడించాలంటూ...

Published : Mar 03, 2022, 10:19 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో అమ్ముడుపోని ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరుపున ఆడబోతున్నాడా? అవుననే అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

PREV
110
గుజరాత్ టైటాన్స్‌లోకి సురేష్ రైనా?... జాసన్ రాయ్ స్థానంలో ఆడించాలంటూ...

ఐపీఎల్‌లో 11 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకి ఆడిన సురేష్ రైనా, సీఎస్‌కే మూడు సార్లు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...

210

ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలిసారి సురేష్ రైనా లేకుండా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి, లీగ్ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్‌కి కూడా చేరలేకపోయింది...

310

ఐపీఎల్‌లో 5500+ లకు పైగా పరుగులు, 39 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేసిన సురేష్ రైనా... మెగా వేలంలో అమ్ముడుపోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

410

మిగిలిన జట్ల పరిస్థితి ఎలా ఉన్నా, దశాబ్దానికి పైగా చెన్నై సూపర్ కింగ్స్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న సురేష్ రైనాని సీఎస్‌కే కూడా కొనుగోలు చేయకపోవడం షాక్‌కి గురి చేసింది...

510

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున సురేష్ రైనా ఆడబోతున్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

610

గుజరాత్ టైటాన్స్ జట్టు, వేలంలో కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్... వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

710

జాసన్ రాయ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టు సురేష్ రైనాని రిప్లేస్‌మెంట్‌గా ఎంచుకుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి...

810

జాసన్ రాయ్ స్థానంలో సురేష్ రైనాని గుజరాత్ టైటాన్స్ రిప్లేస్ చేసుకుందంటూ ఐపీఎల్‌ ఖాతా నుంచి పోస్టు కూడా వచ్చింది. అయితే అది నిజం కాదు, ఫేక్ అకౌంట్...

910

జాసన్ రాయ్ స్థానంలో రిప్లేస్‌మెంట్‌‌గా సురేష్ రైనాని కొనుగోలు చేసేందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే జాసన్ రాయ్ ఫారిన్ ఓపెనింగ్ ప్లేయర్. రైనా ఇండియన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్...
 

1010

సురేష్ రైనాని రిప్లేస్‌మెంట్‌గా తీసుకోవాలంటే భారత మిడిల్ ఆర్డర్ ప్లేయర్ స్థానంలో తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!

Recommended Stories