DC Vs SRH: సన్‌రైజర్స్ హైద‌రాబాద్ రెండో ఓట‌మి ! ఢిల్లీ అద‌ర‌గొట్టింది బాసూ !

IPL 2025 DC Vs SRH: అభిషేక్ పోరెల్ భారీ సిక్స‌ర్ బాది ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ 2025లో రెండో విజ‌యాన్ని అందించాడు. ఐపీఎల్ 2025 10వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 
 

Faf du Plessis

IPL 2025 DC Vs SRH: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో ఓట‌మిని చ‌విచూసింది. భారీ అంచ‌నాల‌తో వైజాగ్ లో అడుగుపెట్టిన హైద‌రాబాద్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో నిరాశ‌ప‌రిచింది. దీంతో ఆ టీమ్ ఈ సీజ‌న్ లో రెండో ఓట‌మిని ఎదుర్కొంది. 

ఐపీఎల్ 2025 10వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది. ఈ మెగా లీగ్ లో  ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైద‌రాబాద్ ఆడిన‌ 3 మ్యాచ్‌ల్లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. 

DC vs SRH IPL: Delhi Capitals' stormy win over Sunrisers Hyderabad, Faf du Plessis shines after Mitchell Starc

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విధ్వంసక బ్యాటింగ్ కు పేరుగాంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ‌రోసారి దుమ్మురేపుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ మెరుపులు క‌నిపించ‌లేదు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. పాట్ కమిన్స్ జట్టు 18.4 ఓవర్లలో 163 ​​పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ జట్టు 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులతో విజ‌యాన్ని అందుకుంది.


DC vs SRH IPL: Delhi Capitals' stormy win over Sunrisers Hyderabad, Faf du Plessis shines after Mitchell Starc

ఢిల్లీ తరఫున ఫాఫ్ డు ప్లెసిస్ 27 బంతుల్లో 50 పరుగులు, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 32 బంతుల్లో 38 పరుగులు ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.1 ఓవర్లలో 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీకి మంచి ఆరంభాన్ని అందించారు. ఆ త‌ర్వాత‌ అభిషేక్ పోరెల్ 18 బంతుల్లో 34 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో మ్యాచ్ విన్నింగ్ సిక్స‌ర్ బాదాడు.

అలాగే, ట్రిస్టన్ స్టబ్స్ 14 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 15 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ తరఫున అరంగేట్ర ఆటగాడు జీషన్ అన్సారీ మూడు వికెట్లు పడగొట్టాడు.

DC vs SRH IPL: Delhi Capitals' stormy win over Sunrisers Hyderabad, Faf du Plessis shines after Mitchell Starc

అంతకుముందు సన్‌రైజర్స్ తరఫున స్టార్ ప్లేయ‌ర్లు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. స్టార్క్ అద్భుత‌మైన బౌలింగ్ తో ఎస్ఆర్హెచ్ ను దెబ్బ‌కొట్టాడు. అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిష‌న్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు త్వ‌ర‌గానే పెవిలియ‌న్ కు చేరిన స‌మ‌యంలో యంగ్ ప్లేయ‌ర్ అనికేత్ వర్మ సునామీ ఇన్నింగ్స్ తో 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

హెన్రిచ్ క్లాసెన్ (32), ట్రావిస్ హెడ్ (22) మాత్రమే రెండంకెల స్కోరును సాధించగలిగారు. ఢిల్లీ తరఫున మిచెల్ స్టార్క్ 3.4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఢిల్లీ టీమ్ 4 పాయింట్ల‌తో 2 స్థానంలోకి చేరింది. టాప్ లో ఆర్సీబీ కొన‌సాగుతోంది. హైద‌రాబాద్ టీమ్ 2 పాయింట్ల‌తో 6వ స్థానంలో ఉంది. 

Latest Videos

click me!