DC vs GT: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు షాకిచ్చి ప్లేఆఫ్స్ కు చేరిన‌ గుజ‌రాత్ టైటాన్స్

Published : May 18, 2025, 11:32 PM IST

IPL 2025 DC vs GT: సాయి సుదర్శన్ సెంచరీతో పాటు శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ నాక్ తో ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై గుజ‌రాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో విక్ట‌రీ కొట్టింది. ఈ విజ‌యంతో శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీలోని గుజ‌రాత్ జ‌ట్టు ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది.   

PREV
15
DC vs GT: ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు షాకిచ్చి ప్లేఆఫ్స్ కు చేరిన‌ గుజ‌రాత్ టైటాన్స్

IPL 2025 DC vs GT: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 60వ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ కీల‌క పోరులో గుజ‌రాత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ప్లేఆఫ్స్ పరంగా ఈ మ్యాచ్ ఢిల్లీ జట్టుకు డు ఆర్ డై మ్యాచ్. అయితే, కేఎల్ రాహుల్ సెంచ‌రీ కూడా ఢిల్లీని గెలిపించ‌లేక‌పోయింది. 

25
IPL 2025: Delhi Capitals vs Gujarat Titans

ఈ మ్యాచ్ లో 200 ప‌రుగులు భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. ఢిల్లీ జట్టు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. 200 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా చేరుకున్న తొలి జట్టుగా గుజరాత్ రికార్డు సాధించింది. సాయి సుదర్శన్ సెంచరీ చేయగా, గిల్ 93 పరుగుల సూప‌ర్ నాక్ ఆడాడు.

35
KL Rahul

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లలో కేఎల్ రాహుల్ సూప‌ర్ నాక్ ఆడాడు. అద్భుత‌మైన 112 ప‌రుగుల‌ సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగులు, కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ 25 ప‌రుగుల ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. 

45

200 ప‌రుగులు టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఈజీగానే మ‌రో ఓవ‌ర్ మిగిలి వుండ‌గానే టార్గెట్ ను అందుకుంది. ఒక్క‌వికెట్ కూడా కోల్పోకుండా 19 ఓవ‌ర్ల‌లోనే 205 ప‌రుగుల‌తో టార్గెట్ ను అందుకుంది. ఈ గెలుపుతో గుజ‌రాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ కు చేరుకుంది. 

 

55
Sai Sudarshan

ఇప్ప‌టిర‌కు12 మ్యాచ్ లు ఆడిన జీటీ 9 విజయాలతో 18 పాయింట్లతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. జీటీ గెలుపుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. మొదటి నాలుగు జట్లు ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. ఇప్పటికే జీటీ, ఆర్సీబీ, పీబీకేఎస్ లు ప్లేఆఫ్స్ చేరగా, మిగిలిన ఒక స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి. 

Read more Photos on
click me!