KL Rahul: ఐపీఎల్‌లో సూప‌ర్ సెంచ‌రీతో రికార్డుల మోత మోగించిన కేఎల్ రాహుల్

Published : May 18, 2025, 10:27 PM ISTUpdated : May 18, 2025, 10:59 PM IST

KL Rahul: ఢిల్లీ క్యాపిట‌ల్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచ‌రీతో దుమ్మురేపాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.  

PREV
16
KL Rahul: ఐపీఎల్‌లో సూప‌ర్ సెంచ‌రీతో రికార్డుల మోత మోగించిన కేఎల్ రాహుల్

KL Rahul: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించలేని అరుదైన రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూప‌ర్ సెంచ‌రీ బాదాడు. దీంతో ఐపీఎల్ లో మూడు భిన్నమైన జట్ల తరఫున సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా కేఎల్ రాహుల్ ఘ‌న‌త సాధించాడు. 

26

ఢిల్లీ క్యాపిట‌ల్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 112 ప‌ర‌గులు చేశారు. త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఈ సెంచ‌రీతో మ‌రో సూప‌ర్ రికార్డును సాధించాడు. 

36
KL Rahul

ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తరఫున సెంచ‌రీలు కొట్టిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఫీట్ న‌మోదుకావ‌డం తొలిసారి. 

46
KL Rahul

కేవలం సెంచరీలే కాదు, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మరిన్ని రికార్డులను కూడా బ‌ద్ద‌లు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో 8000 పరుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఈ మైలురాయి అత్యంత వేగంగా అందుకున్న భార‌త ప్లేయ‌ర్ గా నిలిచాడు. 

ఈ ఘనతను కేఎల్ రాహుల్ కేవలం 224 ఇన్నింగ్స్‌లో సాధించాడు. ఆ త‌ర్వాత విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల‌లో 8 వేల ప‌రుగుల‌ను అందుకున్నాడు. అంతర్జాతీయంగా చూస్తే కేఎల్ రాహుల్ 8000 పరుగుల మార్కును అత్యంత వేగంగా పూర్తి చేసిన మూడో ఆటగాడు. అతనికి ముందు కేవలం క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్), బాబర్ ఆజం (218 ఇన్నింగ్స్) మాత్రమే ఈ ఘ‌న‌త సాధించారు. 

56
KL Rahul

టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు

1. విరాట్ కోహ్లీ 9
2. రోహిత్ శర్మ 8
3. కేఎల్ రాహుల్ 7
4. అభిషేక్ శర్మ 7
5. సూర్యకుమార్ యాదవ్ 6
6. సంజు శాంస‌న్ 6
7. శుభం మన్ గిల్ 6
8. రుతురాజ్ గైక్వాడ్ 6

66
KL Rahul

కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు మొత్తం 7 టీ20 సెంచరీలు సాధించాడు. ఇందులో ఐపీఎల్‌లోనే 5 సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ నాలుగవ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయ‌ర్లు

1. విరాట్ కోహ్లీ 8
2. జోస్ బట్లర్ 7
3. క్రిస్ గేల్ 6
4. కేఎల్ రాహుల్ 5

Read more Photos on
click me!

Recommended Stories