మా ఆయనకి అది చాలా ఎక్కువ, పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది... డేవిడ్ వార్నర్ భార్య క్యాండిక్...

First Published Jun 5, 2021, 3:53 PM IST

ఆస్ట్రేలియాలో కంటే భారత్‌లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఆసీస్ ఓపెనర్ వార్నర్ క్యూట్ ఫ్యామిలీకి కూడా ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది ఆయన భార్య క్యాండిక్ వార్నర్...

‘డేవిడ్ వార్నర్‌ను నేను మా పెళ్లికి రెండేళ్ల ముందు మొదటిసారి కలిశాను. మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా వార్నర్‌తో నాకు పరిచయం కలిగింది. అయితే అతన్ని మొదటిసారి చూసినప్పుడు మొరటోడిలా కనిపించాడు.
undefined
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, కానీ నాకు మాత్రం డేవిడ్ వార్నర్ మొదట్లో అస్సలు నచ్చలేదు. ఎంతో అహంకారం ఉన్న వ్యక్తిలా కనిపించాడు. ఫ్రెండ్లీ నేచర్‌ అస్సలు కనిపించలేదు.
undefined
అదీకాకుండా అప్పటికే డేవిడ్ వార్నర్‌కి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. వార్నర్ క్రికెటర్ అనే విషయం, టీవీలో చూసేదాకా తెలీదు. ఓ రోజు అనుకోకుండా టీవీ ఛానెళ్లు మారుస్తుంటే వార్నర్ టీవీలో కనిపించాడు. దాంతో అతనికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేశా...
undefined
అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, రెండేళ్లల్లోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యేంత దగ్గరైపోయాం... ఆ గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ నా వల్లనే అయ్యిందేమో...’ అంటూ నవ్వేసింది క్యాండిక్ వార్నర్.
undefined
ఏ మాత్రం మొహమాటం లేకుండా మాట్లాడే క్యాండిక్ వార్నర్‌, చాలా బోల్డ కామెంట్స్ చేస్తుంటుంది. ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత మేం హార్డ్ సెక్స్‌లో పాల్గొనడం వల్లే ఇలా జరిగిందని కామెంట్ చేసింది క్యాండిక్...
undefined
2015లో క్యాండిక్‌ను పెళ్లాడిన డేవిడ్ వార్నర్, అదే ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాతి ఏడాది క్యాండిక్ ఓ ఆడబిడ్డకు జన్మనివ్వగా... అదే ఏడాది డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచింది...
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అత్యంత విజయవంతమైన ఐపీఎల్ జట్లలో ఒకడిగా నిలిపిన డేవిడ్ వార్నర్‌ను 2021 సీజన్‌లో పర్ఫామెన్స్ ఆధారంగా, కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
undefined
డేవిడ్ వార్నర్‌కి ముగ్గురు కూతుళ్లు సంతానం. వీరి కుటుంబం మొత్తం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉండేవాళ్లు. అలాంటి వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి అవమానించింది సన్‌రైజర్స్.
undefined
దీంతో వచ్చే సీజన్‌లో డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడడం అనుమానంగా మారింది. మెగా వేలం 2022 సీజన్‌లో వార్నర్‌ను జట్టు నుంచి దూరం చేసేందుకు సన్‌రైజర్స్ ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి.
undefined
click me!