అది పెద్ద జోక్, అసలు నిజాలన్నీ నాకు తెలుసు... డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ షాకింగ్ కామెంట్స్...

First Published May 18, 2021, 10:10 AM IST

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో మరోసారి సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ వివాదం ముదురుతోంది. సాండ్ పేపర్ బాల్‌ టాంపరింగ్ వివాదంలో నిషేధానికి గురైన ఆసీస్ క్రికెటర్ కామెరూన్ బాంక్రాఫ్ట్, బౌలర్లకు కూడా ఈ విషయం తెలుసని చెప్పడంతో ముగిసిపోయిందనుకున్న ఎపిసోడ్‌కి మళ్లీ తెరలేచింది.

2018 కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి 8 నెలల నిషేధానికి గురైన కామెరూన్ బాంక్రాఫ్ట్‌కి, ఆ బ్యాన్ కాల వ్యవధి పూర్తయిన తర్వాత కూడా తిరిగి జట్టులో చోటు దక్కలేదు.
undefined
ఏడాది పాటు నిషేధానికి గురైన అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మాత్రం మళ్లీ ఆసీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి, స్టార్లుగా వెలుగొందుతున్నారు. దీంతో కామెరూన్ బాంక్రాఫ్ట్‌, మరోసారి ఈ విషయం గురించి మాట్లాడాడు.
undefined
‘నేను చేసింది తప్పే, కానీ ఆ రోజు మేం చేసిన పని బౌలర్లకు అనుకూలించేది. అది వారికి తెలియకుండా ఎలా ఉంటుంది. మేం సాండ్ పేపర్‌తో బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతున్నామని బౌలర్లందరికీ తెలుసు’ అంటూ వ్యాఖ్యానించాడు కామెరూన్...
undefined
దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయం గురించి మరోసారి విచారణ జరిపించేందుకు సిద్ధమంటా ప్రకటించింది కూడా. తాజాగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ ఈ విషయం గురించి, పూర్తిగా తనకు తెలుసని సంచలన ఆరోపణలు చేశాడు...
undefined
‘అప్పటి సంఘటన గురించి పూర్తి విచారణ చేసి, రిపోర్టు సమర్పించామని చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే వాళ్లు అందరు ప్లేయర్లను ఇంటర్వ్యూ చేయలేదు. నిజానికి ఆ సంఘటనపై సరైన రీతిలో విచారణ జరగింది. ఆ దర్యాప్తు మొత్తం ఓ జోక్...
undefined
ఆ రోజు ఏం జరిగింది. ఆ సంఘటనలో ఎవరెవరికి సంబంధం ఉన్నది నాకు పూర్తిగా తెలుసు. అయితే ఆ విషయాలు బయటికి వస్తే, ఆసీస్ ప్రజలు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేసిన పనికి వాళ్లను ఇక ఇష్టపడకపోవచ్చు...
undefined
ఆ సంఘటన తర్వాత స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామరూన్ బాంక్రాఫ్ట్‌ల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. వాళ్లు తప్పు చేశారు, కానీ అది శిక్ష వేయాల్సినంత నేరమైతే కాదు...
undefined
ఆ ముగ్గురిలో ఏ ఒక్కరో, ఇద్దరూ న్యాయపోరాటం చేసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. నిజాలు బయటికి వచ్చి, వాళ్లు గెలిచేవాళ్లు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు జేమ్స్ ఎర్క్సైన్...
undefined
బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ ఊడింది. వైస్ కెప్టెన్‌గా వ్యవహారించిన డేవిడ్ వార్నర్‌, మళ్లీ వైస్‌గా కానీ, కెప్టెన్‌గా కానీ వ్యవహారించకూడదని జీవిత కాల నిషేధం పడింది...బౌలర్లకు మాత్రం ఎలాంటి శిక్ష పడలేదు.
undefined
click me!