డేవిడ్ వార్నర్‌పై బ్యాన్ ఎత్తేస్తే ఏమవుతుంది? ఆస్ట్రేలియా కెప్టెన్ అయిపోతాడా... ఇయాన్ ఛాపెల్ కామెంట్...

First Published Dec 16, 2022, 1:57 PM IST

సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత అప్పటి ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై జీవిత కాల కెప్టెన్సీ నిషేధాన్ని విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనూ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేయకుండా బ్యాన్ విధించింది. నాలుగేళ్లు దాటినా ఆ నిషేధం కొనసాగుతోంది...

Steve Smith

సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాద సమయంలో ఆసీస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌, ఏడాది నిషేధం తర్వాత తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు వైస్ కెప్టెన్‌గా ఉంటూ ప్యాట్ కమ్మిన్స్ గాయపడిన మ్యాచుల్లో కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు..

Image credit: Getty

అయితే డేవిడ్ వార్నర్‌పై మాత్రం నిషేధాన్ని ఎత్తివేయడానికి తెగ ఆలోచిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా... ‘డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తి వేస్తే ఏం జరుగుతుంది? అతను ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కి కెప్టెన్‌గా నియమించబడతాడా? లేదు కదా.. వార్నర్‌కి 37 ఏళ్లు...

David Warner

ఈ వయసులో ఏ ఫార్మాట్‌లోనూ డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వరు. ఒకవేళ వార్నర్ 32 ఏళ్ల వయసులో ఉండి, కెప్టెన్సీ బ్యాన్ ఎత్తి వేస్తే.. అతను ఆసీస్ టీమ్‌కి కెప్టెన్‌గా మారతాడేమోనని భయపడుతున్నారని అనుకోవచ్చు. డేవిడ్ ఆ వయసు దాటి చాలా ముందుకు వచ్చేశాడు..

Pat Cummins- David Warner

నాకు తెలిసి డేవిడ్ వార్నర్, బీబీఎల్ టీమ్ సిడ్నీ థండర్స్‌కి కెప్టెన్సీ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే తనపైన ఉన్న కెప్టెన్సీ లైఫ్ టైమ్ బ్యాన్‌ని ఎత్తివేయాలని వేడుకుంటున్నాడు. డేవిడ్ వార్నర్ చాలా మంచి లీడర్. గేమ్‌పైన వార్నర్‌కి ఉన్న అంకిత భావాన్ని శంకించాల్సిన అవసరం లేదు...

కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికైనా ఓ సారి దీని గురించి ఆలోచించాలి. ప్లేయర్ల విషయంలో పక్షపాతం కరెక్టు కాదు. స్టీవ్ స్మిత్‌కి కెప్టెన్సీ చేసే అవకాశం ఇచ్చి, డేవిడ్ వార్నర్‌పై నిషేధాన్ని ఎత్తి వేయడానికి ఇంత ఆలోచించడం చాలా విమర్శలకు తావిస్తుంది...

David Warner

ఇలా తమకు నచ్చిన ప్లేయర్లను మాత్రమే సపోర్ట్ చేయడం వల్ల క్రికెట్ ఆస్ట్రేలియా ఇమేజ్ దెబ్బతింటుంది. ఇప్పటికే డేవిడ్ వార్నర్ విషయాన్ని, బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని హ్యాండిల్ చేయడంలో మీరు ఘోరంగా దెబ్బ తిన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ ఛాపెల్.. 

click me!