డేవిడ్ వార్నర్‌ని బలి పశువుని చేశారు! స్మిత్‌కో న్యాయం, వార్నర్‌కో న్యాయమా... మైకేల్ క్లార్క్ ఆగ్రహం...

Published : Dec 09, 2022, 11:18 AM IST

క్రికెట్ ప్రపంచాన్ని దశాబ్దాలుగా శాసించిన ఆస్ట్రేలియా క్రికెట్‌లో సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం రేపిన చిచ్చు.. అంతా ఇంతా కాదు. నాలుగైళ్లైనా ఈ వివాదం ఇప్పటికీ చల్లారలేదు. నాలుగు వన్డే వరల్డ్ కప్స్, ఓ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు.. సాండ్ పేపర్ వివాదం కారణంగా ఛీటర్స్‌గా ముద్రపడి, అందరి ముందూ తలదించుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నాడు అప్పటి ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

PREV
17
డేవిడ్ వార్నర్‌ని బలి పశువుని చేశారు! స్మిత్‌కో న్యాయం, వార్నర్‌కో న్యాయమా... మైకేల్ క్లార్క్ ఆగ్రహం...

టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఆరోన్ ఫించ్ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆసీస్ వైట్ బాల్ కెప్టెన్సీ డేవిడ్ వార్నర్‌కే దక్కుతుందని అనుకున్నారంతా. అయితే సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్‌పై లైఫ్ టైం కెప్టెన్సీ బ్యాన్ పడింది. ఈ కారణంగానే వార్నర్‌ని పక్కనబెట్టి ప్యాట్ కమ్మిన్స్‌కి వన్డే కెప్టెన్సీ అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

27
Ball-tampering scandal

అయితే బాల్ ట్యాంపరింగ్ వివాద సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌పై నిషేధం ఎత్తి వేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టుకి స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ కూడా చేశాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టుకి కూడా స్మిత్ కెప్టెన్సీ చేయబోతున్నాడు...

37

అయితే అప్పటి వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై పడిన జీవితకాల కెప్టెన్సీ నిషేధం మాత్రం తీసివేయలేదు క్రికెట్ ఆస్ట్రేలియా.. దీనిపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందించాడు. ‘క్రికెట్ ఆస్ట్రేలియా తీరు కారణంగా డేవిడ్ వార్నర్ నిరాశపడ్డాడు, తీవ్ర అసహనానికి గురి అయ్యాడు...

47

తనపై వేసిన కెప్టెన్సీ బ్యాన్ తొలగించకపోవడంతో పాటు స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకి కెప్టెన్సీ చేస్తుండడం కూడా వార్నర్‌ని మరింత బాధపెట్టొచ్చు. డేవిడ్ వార్నర్ ఎలా ఆలోచిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను. ఈ వయసులో వార్నర్‌పై బ్యాన్ తొలగించినా, అతను కెప్టెన్సీ చేసే అవకాశాలను ఇప్పటికే కోల్పోయాడు...
 

57
David Warner

క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకని ఇంత ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తుందో నాకు అర్థం కావడం లేదు. బ్యాన్ వేస్తే ఇద్దరిపై వేయాలి? కెప్టెన్‌పై బ్యాన్‌ని తొలగించి వైస్ కెప్టెన్‌పై జీవితకాలం బ్యాన్ వేయడం ఎందుకు? సౌతాఫ్రికాలో జరిగిన దానికి స్టీవ్ స్మిత్ కూడా కారణమే కదా...

67

సాండ్‌పేపర్ వివాదంలో డేవిడ్ వార్నర్‌ని బలిపశువుని చేశారు. ఆ స్కామ్‌లో పాలుపంచుకున్న వాళ్లంతా స్వేచ్ఛగా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. డేవిడ్ వార్నర్ మాత్రం ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా ఎప్పుడు నిషేధం ఎత్తివేస్తుందా.. అని ఎదురుచూస్తున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. 

77

2018లో సౌతాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో కామెరూన్ బాంక్రాఫ్ట్, ప్యాంటు జేబులో సాండ్ పేపర్ పెట్టుకుని బంతిని ట్యాంపరింగ్ చేస్తున్నట్టు కెమెరాల్లో రికార్డైంది. ఈ బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ ఊడింది. వైస్ కెప్టెన్‌గా వ్యవహారించిన డేవిడ్ వార్నర్‌, మళ్లీ వైస్‌గా కానీ, కెప్టెన్‌గా కానీ వ్యవహారించకూడదని జీవిత కాల నిషేధం పడింది... 

click me!

Recommended Stories