షర్టు విప్పి, ఆలియా భట్‌తో కలిసి చిందులేసిన డేవిడ్ వార్నర్... వార్నర్ భాయ్ కొత్త వీడియో చూస్తే...

First Published Jun 5, 2021, 11:12 AM IST

ఒక్కో క్రికెటర్‌కి ఒక్కో హాబీ ఉంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి మాత్రం భారతీయ సినిమాల పాటలను, టీజర్లను ట్రెండింగ్ చేయడమే హాబీ. ఇప్పటికే ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి రికార్డు వ్యూస్ తెప్పించిన వార్నర్, తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు.

ఐపీఎల్ 2021 సీజన్ నడుస్తున్న సమయంలో కూడా రీఫేస్ వీడియోలు పోస్టు చేస్తూ సందడి చేసిన డేవిడ్ వార్నర్, ఇప్పుడు తన ఇంటి నుంచే ఈ పనిలో పడ్డాడు. తాజాగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలోని ఓ పాటను స్ఫూఫ్ చేసి పోస్టు చేశాడు.
undefined
షర్టు లేకుండా సిక్స్ ప్యాక్ చూపిస్తూ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్‌తో కలిసి చిందులేస్తూ టైగర్ ష్రాఫ్ చేసిన ఈ పాటలో వార్నర్ ముఖం పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. అయితే పాట కింద ‘కేవలం పాపులర్ డిమాండ్ కారణంగానే మళ్లీ ఇలాంటి వీడియోలు పెడుతున్నా’ అంటూ కాప్షన్ ఇవ్వడం విశేషం.
undefined
ఇప్పటికే ధనుష్‌గా మారి, ‘రౌడీ బేబీ’ పాటలో సాయి పల్లవితో కలిసి చిందులేసిన డేవిడ్ వార్నర్, ‘రాములో రాములా’ అంటూ పూజా హెగ్దేతో కలిసి ఆడిపాడాడు. ఇప్పుడీ లిస్టులోకి ఆలియా భట్ కూడా వచ్చి చేరింది.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
undefined
మొదటి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటములపై స్పందించిన డేవిడ్ వార్నర్, టీమ్ సెలక్షన్ విషయంలో తనకి స్వేచ్ఛ లేదని చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్, అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది.
undefined
కేన్ విలియంసన్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ ఆడిన మొదటి మ్యాచ్‌లో భారీ పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌కి తుది జట్టులో కూడా చోటు లేకపోవడం విశేషం.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఆ సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా న్యూజిలాండ్ ప్లేయర్లు, ఐపీఎల్‌కి రావడం లేదు.
undefined
కేన్ విలియంసన్ రావడం లేదని కన్ఫార్మ్ కాగా... ఆస్ట్రేలియా ప్లేయర్లను ఐపీఎల్‌కి పంపుతామని ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే యూఏఈకి వెళ్లాలా? వద్దా ? అనేది ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది.
undefined
దీంతో డేవిడ్ వార్నర్, ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు వస్తాడా? లేదా? అనేది కూడా ఇంకా తేలలేదు. విలియంసన్ రాకపోతే మిగిలిన మ్యాచులకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహారిస్తారనేదానిపై కూడా క్లారిటీ రాలేదు.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత డేవిడ్ వార్నర్ తెలుగు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగులో వేసిన ట్వీట్ల కారణంగా, అతను వచ్చే సీజన్‌లో జట్టును వీడబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
undefined
click me!