నా రంగు చూసి, ఆసీస్ జట్టులో ఆడడానికి సరిపోనని అన్నారు... ఉస్మాన్ ఖవాజా షాకింగ్ కామెంట్స్..

First Published Jun 5, 2021, 10:35 AM IST

ఇంగ్లాండ్ క్రికెటర్  ఓల్లీ రాబిన్‌సన్ వేసిన రేసిజం, సెక్సిస్ట్ ట్వీట్లు వెలుగులోకి రావడంతో క్రికెట్‌లో వర్ణ వివక్ష గురించి మరోసారి చర్చ జరుగుతోంది. 8 ఏళ్ల క్రితం వేసిన పాత ట్వీట్ల కారణంగా ఓల్లీ రాబిన్‌సిన్‌ను రెండో టెస్టు జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ జట్టు. 

డ్రెసింగ్‌ రూమ్‌లోని సభ్యులతో పాటు ఇంగ్లాండ్‌కీ, యావత్ ప్రపంచానికి అతను క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఓల్లీ రాబిన్‌సన్, ఇప్పటికే క్షమాపణలు చెప్పినా, అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.
undefined
తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా, తాను కూడా వర్ణ వివక్షను ఎదుర్కొన్నానంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో పుట్టిన ఉస్మాన్ ఖవాజా, 2011 నుంచి ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడుతున్నాడు.
undefined
పాకిస్తాన్‌లో జన్మించి, ఆస్ట్రేలియా తరుపున టెస్టు క్రికెట్ ఆడిన మొట్టమొదటి ముస్లింగా రికార్డు క్రియేట్ చేశాడు ఉస్మాన్ ఖవాజా. 80 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆసీస్ తరుపున ఆడిన ఏడో విదేశీ ప్లేయర్ ఖవాజా...
undefined
‘ఆస్ట్రేలియాకి వెళ్లిన తర్వాత ఆసీస్ టీమ్ తరుపున క్రికెట్ ఆడాలని ఆశపడ్డాను. అయితే నా రంగు చూసి, ఆసీస్ టీమ్‌లో ఆడడానికి నువ్వు పనికి రావని చెప్పి హేళన చేసేవాళ్లు. అప్పట్లో ఆస్ట్రేలియళ్ల మెంటాల్టీ అలా ఉండేది. అయితే ఇప్పుడు అది మారుతోంది...
undefined
నేను జట్టును ఆడడం మొదలెట్టిన తర్వాత ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న చాలామంది విదేశీ ప్లేయర్లు నా దగ్గరికి వచ్చి సంతోషం వ్యక్తం చేయడం మొదలెట్టారు.
undefined
‘‘నువ్వు ఆసీస్ టీమ్‌లో టాప్‌లో ఆడుతుండడం చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూస్తుంటే, మేం కూడా భవిష్యత్తులో ఆస్ట్రేలియాకి ఆడగలమని నమ్మకం వస్తోంది... మేం ఇప్పుడు ఆసీస్ టీమ్‌కి మద్ధతు చేస్తున్నాం. మేం ఇంతకుముందు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కి సపోర్ట్ చేసేవాళ్ల కాదు, ఇప్పుడు చేస్తాం...’’ అంటూ చెప్పేవాళ్లు...
undefined
విదేశాల్లో జన్మించిన చాలామంది ప్లేయర్లు స్టేట్ లెవెల్స్ దాకా వచ్చేవాళ్లు. అయితే వారికి ఆస్ట్రేలియా జట్టులో మాత్రం చోటు దక్కేది కాదు. నేను జట్టులోకి వచ్చిన తర్వాత అలా ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు కూడా రావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఉస్మాన్ ఖవాజా...
undefined
ఐదేళ్ల వయసులో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఉస్మాన్ ఖవాజా, ఆసీస్ జట్టు తరుపున 44 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ఇందులో 10 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు నమోదుచేశాడు. అయితే 2019 యాషెస్ సిరీస్ తర్వాత మళ్లీ ఉస్మాన్ ఖవాజాకి జట్టులో చోటు దక్కలేదు.
undefined
click me!