ఇది మరో ఆర్‌సీబీలా ఉందే! కేకేఆర్‌ నుంచి బయటికి వచ్చారు, చెలరేగిపోతున్నారు...

Published : Apr 03, 2022, 03:58 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అటు సీనియర్లు, ఇటు జూనియర్లు అదరగొడుతున్నారు. భారీ అంచనాలతో సీజన్‌ని స్టార్ట్ చేసిన ప్లేయర్ల నుంచి ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ రాకపోగా.. ఎలాంటి అంచనాలు లేని వాళ్లు మాత్రం ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇరగదీస్తున్నారు...

PREV
110
ఇది మరో ఆర్‌సీబీలా ఉందే! కేకేఆర్‌ నుంచి బయటికి వచ్చారు, చెలరేగిపోతున్నారు...

ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లలో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయిన సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్, మూడు మ్యాచుల్లో 8 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు...

210

బేసిగ్గానే ఎప్పటి నుంచి ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చే ప్లేయర్లు, వేరే జట్ల తరుపున అదరగొడతారనే సెంటిమెంట్ ఉంది. ఇంతకుముందు క్రిస్ గేల్, షేన్ వాట్సన్, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లు ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు..  

310

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న వారిలో ఎక్కువ మంది కేకేఆర్ ప్లేయర్లు ఉండడం విశేషం. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను రిటైన్ చేసుకుంది కేకేఆర్...

410
Prasidh Krishna

కేకేఆర్ నుంచి బయటికి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే 19వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ, కేవలం 10 పరుగులే ఇచ్చి, డేంజరస్ మ్యాన్ పోలార్డ్‌ను భారీ షాట్లు ఆడకుండా అడ్డుకోగలిగాడు.

510

అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ మెయిడిన్‌తో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి, కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి వంటి కీ ప్లేయర్లను అవుట్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ...

610

ఐపీఎల్ మెగా వేలానికి ముందే శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన గిల్, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు...

710

44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు శుబ్‌మన్ గిల్...
 

810

లూకీ ఫర్గూసన్‌ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయిన లూకీ ఫర్గూసన్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు...

910
Dinesh Karthik

దినేశ్ కార్తీక్, కేకేఆర్ మాజీ కెప్టెన్. 37 ఏళ్ల దినేశ్ కార్తీక్‌ని వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లేటు వయసులో దూకుడు చూపిస్తున్న దినేశ్ కార్తీక్, ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు. 

1010

కుల్దీప్ యాదవ్‌ను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, మానసికంగా ఎంతో క్షోభకు గురి చేసింది కేకేఆర్. కోల్‌కత్తా నుంచి బయటికి వచ్చిన కుల్దీప్ యాదవ్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా మారాడు... 

Read more Photos on
click me!

Recommended Stories