ద్రావిడ్ కూడా తప్పులు చేస్తాడు.. కానీ..!! టీమిండియా హెడ్ కోచ్ పై బీసీసీఐ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Published : Apr 03, 2022, 03:59 PM IST

Sourav Ganguly Comments On Rahul Dravid: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు అధ్యక్షుడిగా ఉన్న  సౌరవ్ గంగూలీ.. గతేడాది జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ గా ఉన్న ద్రావిడ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా చేయడానికి ఒప్పించాడు. అయితే.. 

PREV
16
ద్రావిడ్ కూడా తప్పులు చేస్తాడు.. కానీ..!! టీమిండియా హెడ్ కోచ్ పై బీసీసీఐ చీఫ్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ కూడా మానవ  మాత్రుడేనని అతడు కూడా తప్పులు చేస్తాడని  గంగూలీ వ్యాఖ్యానించాడు. 

26

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న  గంగూలీ... ‘ద్రావిడ్ క్రికెట్ ఆడే రోజుల్లో ఎలా ఉన్నాడో  ఇప్పుడూ అలాగే ఉన్నాడు.  ద్రావిడ్ లో నేను చూసిన ఒకే తేడా ఏంటంటే.. 

36

ఇప్పుడు అతడు భారత్ కోసం  మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అతడు ప్రపంచంలోని నెంబర్ వన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు.  చాలా కాలం పాటు భారత జట్టుకు తిరుగులేని ఆటగాడిగా ఉన్న ద్రావిడ్.. కోచ్ గా కూడా అలాంటి విజయాలే సాధిస్తాడు. 

46

ద్రావిడ్ తప్పకుండా భారత్ కు విజయవంతమైన  ప్రధాన కోచ్ అవుతాడు. అతడిలో గొప్ప ప్రతిభ దాగిఉంది. అయితే  ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఇందుకు ద్రావిడ్ మినహాయింపేమీ కాదు. అతడు కూడా తప్పులు చేస్తాడు. కానీ మీరు సరైన పనులు చేయడానికి  ప్రయత్నించినంత కాలం ఇతరులకన్నా ఎక్కువ విజయాలు సాధిస్తారు...’ అని అన్నాడు. 

56

ద్రావిడ్ ను  భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పోల్చడానికి గంగూలీ నిరాకరించాడు. ఇద్దరూ భిన్నమైన వ్యక్తులని గంగూల అభిప్రాయపడ్డాడు. ‘వాళ్లిద్దరూ భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు. ఒకరు ఎల్లవేళలా మీతోనే ఉంటారు. అదే ఆయన బలం. మరొకరు  మీతో లేకున్నా నిశ్శబ్దంగా తన పని తాను కానిచ్చేస్తాడు..’ అని అన్నాడు. 

66

ఈ ఇద్దరూ ఒకే టెస్టులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు వందలాది మ్యాచులు కలిసి ఆడిన  ఈ క్రికెట్ దిగ్గజాలు   రిటైర్మెంట్ తర్వాత తలో దారి ఎంచుకున్నారు. ద్రావిడ్ ఎన్సీఏ హెడ్ గా నియమితుడై అండర్-19 జట్టుతో పాటు ఇండియా -ఏ కు కోచ్ గా పనిచేశాడు. గంగూలీ బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడై ఆ పై బీసీసీఐకి బాస్ గా  ఎంపికయ్యాడు.  

click me!

Recommended Stories