రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మేగా వేలం నిర్వహించనున్నారు. ఇలాంటి సమయంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఐపీఎల్ వేలంలో ధోని అసలు సీఎస్కే తొలి ప్రాధాన్యత కానేకాదట. ఐపీఎల్ తొలి సీజన్‌లో ధోనీని రూ.9.5 కోట్లకు సీఎస్‌కే వేలం వేసింది. అత్యధిక ధర పలికిన ఆటగాడు ధోనీ నిలిచాడు.
ఆ తర్వాత 2016, 2017లో సీఎస్‌కే లో ఆడకుండా నిషేధం విధించింది. 2022లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, 2024లో రుతురాజ్ గైక్వాడ్‌ను CSK కెప్టెన్‌గా నియమించారు. అయితే, ఐపీఎల్ తొలి సీజన్ లో భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను తొలి వేలంలోనే దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావించింది.
అయితే, వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీకి చెందిన క్రికెటర్. అతను ఢిల్లీ తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ ధోనిని తొలి వేలం వేయాల్సి వచ్చిందని సీఎస్‌కే మాజీ ఆటగాడు బద్రీనాథ్ చెప్పాడు.ఇప్పుడు అతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.