శ్రీలంక ఆసియా కప్ గెలవడం వెనక కూడా ధోనీ హస్తం... ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆట చూశాకే ...

First Published Sep 12, 2022, 12:00 PM IST

క్రికెట్ ప్రపంచంలో ఏ మూల ఏ జట్టు విజయం సాధించినా దాని వెనక మాహీ హస్తం ఉందనే వార్త పుట్టుకురావడం చాలా రొటీన్ విషయం. కొందరు ధోనీని ట్రోల్ చేస్తూ ఇలాంటి వార్తలు వైరల్ చేస్తే, మరికొందరు క్రికెట్ ప్రపంచంలో మాహీ ప్రభావం అలా ఉందని అంటారు. తాజాగా శ్రీలంక, ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలవడం వెనకాల మాహీ ఉన్నాడని స్వయంగా ప్రకటించాడు లంక సారథి దసున్ శనక...
 

యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టాస్... చాలా కీలక పాత్ర పోషించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన జట్లు, మెజారిటీ మ్యాచుల్లో విజయాన్ని అందుకున్నాయి. గ్రూప్ దశలోనే కాదు, సూపర్ 8, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లు 99 శాతం మ్యాచుల్లో గెలిచాయి...

Image credit: Getty

ఆసియా కప్ 2022లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రోహిత్ శర్మ వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిపోవడం, భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది. హంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో విజయం అందుకున్న టీమిండియా... ఆ తర్వాత పాకిస్తాన్, శ్రీలంకతో మ్యాచుల్లో ఓడింది..

పాకిస్తాన్‌పై 180+, శ్రీలంకపై 170+ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది భారత జట్టు.టాస్ వల్లే ఆసియా కప్ 2022 టోర్నీలో ఓడిపోయామని స్వయంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. 

పాకిస్తాన్, శ్రీలంక మధ్య సూపర్ 4 మ్యాచ్‌లోనూ టాస్ ప్రభావం కనిపించింది. పాకిస్తాన్‌ని స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన శ్రీలంక, ఆ లక్ష్యాన్ని 17 ఓవర్లలో ఊదిపారేసింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలవడంతో ఇక వాళ్లదే ఆసియా కప్ టైటిల్ అనుకున్నారంతా. అయితే లంక జట్టు అద్భుతమే చేసింది...

భానుక రాజపక్ష 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేయగా వానిందు హసరంగ 21 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది శ్రీలంక...

asia cup

భారత్‌పై 180+ టార్గెట్‌ని ఛేదించిన పాకిస్తాన్, లంక బౌలర్లను చెడుగుడు ఆడేస్తారని అనుకున్నారు పాక్ అభిమానులు. అయితే లంక బౌలర్లు అద్భుతమై చేశారు. మహ్మద్ రిజ్వాన్ 55, ఇప్థికర్ అహ్మద్ 32 పరుగులతో రాణించినా 20 ఓవర్లలో 147 పరుగులకి ఆలౌట్ అయ్యి 23 పరుగుల తేడాతో ఓడింది పాకిస్తాన్...

‘టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుసు. అయితే 2021 ఫైనల్‌లో ఇక్కడే సీఎస్‌కే, కేకేఆర్‌ని డిఫెండ్ చేస్తూ విజయం అందుకుంది. టాస్ ఓడిపోయిన తర్వాత నేను, టీమ్ ప్లేయర్లతో ఇదే విషయం చెప్పా... సీఎస్‌కే చేసిందే, మనమూ చేయాలని వివరించా... అదే చేయం ఆనందంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక కెప్టెన్ దసున్ శనక...

click me!